అవును మీరు విన్నది నిజమే. చంద్రబాబు సర్కార్ డబ్బు ఇస్తే చాలట.. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, జనసేన అధినేత ఎప్పుడెప్పుడు డప్పుకొడదామా..! అంటూ రెడీగా ఉంటారట. ఈ విషయం ఎవరో చెప్పలేదు.. స్వయాన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దగ్గరి బంధువు కత్తి మహేష్ చెప్పాడు. అదేంటో ఈ మధ్యన కత్తి మహేష్ కేవలం సినిమాలకే కాకుండా రాజకీయాలకు కూడా రివ్యూలు రాస్తూ రేటింగ్ కూడా ఇచ్చేస్తున్నాడు. గత వారంలో పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా చంద్రబాబు సర్కార్‌పై చేసిన వ్యాఖ్యలను అదునుగా చేసుకున్న కత్తి మహేష్ తన ఫేస్‌బుక్‌కు పనిపెట్టాడు.
తన ఫేస్‌బుక్ వేదికగా మరోసారి పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డాడు కత్తి మహేష్. ఆయన స్థాపించింది జనసేన పార్టీ కాదు.. కాపుసేన పార్టీ అంటూ విరుచుకుపడ్డాడు. నాకు అసలు కులమే లేదని పవన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయంటూ ఎద్దేవ చేశాడు. తనకు కుల వ్యవస్థలేని అమరావతి కావాలనడం పవన్ కల్యాణ్‌కు పగటి కలలాగే మిగులుతుందన్నారు. అయితే, పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజలకు నమ్మశక్యంగా లేవని, అసలు కులరాజకీయాలు లేకుండా ఆంధ్ర రాజకీయాలు లేవని పవన్ కల్యాణ్ అజ్ఞాత వాసి కాదు.. అజ్ఞాన వాసి అంటూ సంచలన కామెంట్ చేశాడు కత్తి మహేష్.