ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్‌బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపి పార్టీ నేత నారాయణరెడ్డి హత్యకేసులో శ్యామ్‌బాబు పేరు తొలగింపుపై భార్య శ్రీదేవి డోన్ కోర్టును ఆశ్రయించింది. ఈమేరకు ముగ్గురిపై సీఆర్పీసీ 190, 200 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం చేరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసుకు సంబంధించి, జనవరి 25లోపు పూర్తి వివరాలు స్పందించాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
