ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గత ఎడాది నవంబర్ 6 వ తేది నుండి చేస్తున్న పాదయాత్ర ఈ నెల 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పూర్తి కానుంది. ఆ రోజు జరగనున్న ముగింపు సభ వేదికగా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల హాడావీడి మొదలైంది. గత ఎన్నికల్లో వైసీపీకి కంచుకోట కర్నూలు జిల్లాలో మరోసారి రెండు ఎంపి, 12,లేదా 13 ఎమ్మెల్యే స్థానాలను వైసీపీ కైవసం చేసుకోబోతున్నట్లు వివిధ తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇక అభ్యర్థుల విషయానికొస్తే కర్నూలు జిల్లాలో విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు మరియు వైసీపీ సినీయర్ నేతలు తమ సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నా అభ్యర్థులు అయితే వీరే. పత్తికొండ అభ్యర్థిగా చెరుకులపాడు శ్రీదేవిని ఇప్పటికే జగన్ ప్రకటించారు.ఆలూరు, ఆదోని ,మంత్రాలయం, నందికొట్కూరు, డోన్ నియేజకవర్గాలలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళనే బరిలో దింపనుంది.ఆత్మకూరు ఆళ్ళగడ్డ బనగానపల్లె ఎమ్మిగనూరు నియేజకవర్గాలలో ప్రస్తుతం ఇంచార్జుగా ఉన్న వాళ్ళనే పోటి చేయించనుంది.ఇక మిగిలిన కర్నూలు కోడమూరు పాణ్యం నియేజకవర్గాల గురించి ఇప్పటికైతే స్పష్టత లేదు.కర్నూలు కోడుమూరు నియేజకవర్గాలలో ఇంచార్జులనే బరిలో దింపేందుకు వైసీపీ నుకూలంగా ఉన్నట్లు సమాచారం.అయితే పాణ్యం నియేజకవర్గం మాత్రం వైసిపికి కత్తమీద సాములా మారింది. ఆ నియేజకవర్గ అభ్యర్థి ఎవరో చివరి నిమిషం వరకు చెప్పలేని పరిస్థితి. ఏది ఏమైనప్పటికి కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేల అభ్యర్థులు దాదాపు ఖారారు అయ్యారనే సమాచారం.అంతేకాదు జిల్లాలో 14 కి 14 సీట్లు గెలిచి ఏపీలో వైసీపీ బలం అంటే కర్నూల్ అనేలాగా చేస్తాము అంటున్నారు వైసీపీ నేతలు.
