ఏపీలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీలో చేరేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే టీడీపీ నుండి కడప జిల్లా రాజంపేట మేడా మల్లిఖార్జున రెడ్డి, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకానపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. తాజాగా మాజీ డిజిపి సాంబశివరావు వైసీపీలో చేరుతారని ఆ పార్టీలోని ముఖ్యుల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం. జగన్ పాదయాత్ర సమయంలోనే మాజీ డిజిపి సాంబశివరావు జగన్ ను కలిసారు. ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిసారు. ఆ సమయంలో సాంబశివరావు వైసీపీ లో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ, డిజిపి గా రిటైర్ అయిన తరువాత ఏపి ప్రభుత్వం ఆయనకు గంగవరం పోర్టులో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ హోదాలో ఉన్న సమయంలోనే ఆయన జగన్ ను కలిసారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ..ఆయన వైసీపీలో చేరుతున్నారని ఆ పార్టీ నేతలు చెప్పటం ఇప్పుడు చర్చనీ యాంశంగా మారింది.
