ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభంజనం సృష్టించనుందని జాతీయ మీడియా చానళ్లు తెలిపాయి. వైసీపీ విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్‌లో తేలడంపై రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. అంతేకాదు ఈ ఎన్నికల్లో క్వీన్‌స్వీప్ చేసే పార్టీల్లో వైసీపీ అగ్ర స్థానంలో ఉంటుందని స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు యోగీంద్ర యాదవ్∙ పేర్కొన్నారు. వైఎస్ జగన్ నిజాయితీ, నిబద్ధతలకు తగిన ప్రతిఫలం లభించనుందని ‘యాక్సిస్ మై ఇండియా’ ఎండీ ప్రదీప్ గుప్తా చెప్పారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు నుంచి జగన్ ప్రణాళికాబద్ధంగా గ్రౌండ్ వర్క్ చేయడం, పాదయాత్ర ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరువ కావడం వైసీపీ పట్ల ఆదరణ పెరగటానికి కారణాలని చెప్పారు. ఏది ఏమైన వైఎస్ జగన్ చరిత్ర సృష్టించబోతున్నాడిని తెలుస్తుంది.
