సాధారణంగా ఒక తెలుగు అమ్మాయి ఒక తెలుగు జిల్లాకు ఎస్పీగా నియమితులవ్వడం చాలా అరుదు. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూర్ జిల్లాకు చందన దీప్తి అనే అమ్మాయి ప్రస్తుతం మెదక్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో వరంగల్‌లో సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి ఘటన తర్వాత ఐపీఎస్ కావాలని కలలు కన్న ఆమె 2012లో తన కలను సాకారం చేసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న యువ పోలీస్ అధికారుల్లో ఆమె కూడా ఒకరు. ఎస్పీగా మెదక్ జిల్లాలో ఎన్నో సంస్కరణలు చేపట్టి అనేక సార్లు వార్తల్లో నిలిచారు. తాజాగా మరో సారి వార్తలో నిలిచారు . ఈసారి ఓ సంతోషకరమైన వార్తలో నిలిచారు. విషయం ఏమీటంటే ఎస్పీ చందన దీప్తికి ఇటీవల పెళ్లి నిశ్చయమైన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో జరిగే ఈ పెళ్లి వేడుక ప్రముఖుల రాకతో అంగరంగ వైభవంగా జరగబోతుందని సమాచారం. ఇందులో భాగంగా ఎస్పీ చందన దీప్తి ప్రగతి భవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి అక్టోబర్‌లో జరిగే తన పెళ్లికి రావాలని కోరారు. . అటు ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరవుతారని తెలుస్తోంది . అంతేకాదు ఏపీ సీఎం జగన్ దగ్గరి బంధుతో ఆమె పెళ్లి జరగనుందని తెలుస్తోంది. చందనకు చేసుకోబోయే వ్యక్తి జగన్‌కి స్వయానా బంధువు కావటంతో రెండూ తెలుగు రాష్టాల్లో హాట్ టాపిక్ గా ఎస్పీ చందన దీప్తి పెళ్లి నిలిచింది. ఏది ఏమైనా చందన దీప్తి వివాహానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపైన కనిపించనున్నారన్న మాట!!
