టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ఆత్మహత్యకు సంబంధించి కీలకమైన పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లోఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఒక పక్క వరుసగా చుట్టుముట్టిన కేసులు, చంద్రబాబు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం, కుటుంబ కలహాల నేపథ్యంలో కోడెల మానసికంగా కుంగిపోయారు. ఇక చావే తనకు దిక్కు అని భావించి కోడెల గత ఆదివారం ఉదయం 24 నిమిషాల పాటు ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ 24 నిమిషాల కాల్ ఎవరితో మాట్లాడరనే విషయంపై పోలీసులు కాల్‌డేటాను పరిశీలించారు. ఆత్మహత్యకు ముందు కోడెల 24 నిమిషాల సేపు బసవతారకం ఆసుపత్రిలో ఓ డాక్టర్‌తో మాట్లాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో పోలీసులు ఆ డాక్టర్‌ను విచారించనున్నారు. ఇక కోడెల పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ఎలాగైనా చనిపోవాలని భావించిన కోడెల ఉరిపెట్టుకునే క్రమంలో ఒకసారి విఫలం అయ్యారు. అయినా ఏ మాత్రం వెనుకకు తగ్గకుండా..మళ్లీ రెండోసారి ఆత్మహత్యా ప్రయత్నం చేసి ప్రాణాలు వదిలారు. తొలుత లుంగీతో ఉరి బిగించుకున్నారు. అయితే కోడెల బరువుకు ఆ లుంగీ చినిగిపోయింది..వేరే ఎవరైనా తొలిసారి ఆవేశంతో చేసుకున్న ఆత్మహత్యా ప్రయత్నం ఫెయిల్ అయితే..తర్వాత కనీసం చావు భయంతోనైనా విరమించుకుంటారు. కానీ కోడెల ఎలాగైనా చావాలనే తెగింపుతో పక్కనే ఉన్న వైరుతో ఉరిపెట్టుకుని ప్రాణాలు వదిలారంట…పల్నాడులో తెగింపు కలిగిన నేతగా పేరొందిన కోడెల చావులో కూడా అంతే తెగింపుతో వ్యవహరించడం బాధాకరం. కోడెల ఆత్మహత్య చేసుకునేందుకు ఇలా రెండుసార్లు ప్రయత్నించారని పోస్ట్‌మార్టమ్‌లో తేలడం.. కుటుంబసభ్యులకు, అభిమానులకు షాకింగ్‌గా మారింది. ఎంతగా మానసిక క్షోభ అనుభవిస్తే కోడెల ఇలా రెండుసార్లు ప్రయత్నించి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారు. మూడు దశాబ్దాల పాటు సాగిన కోడెల రాజకీయ ప్రస్థానం చివరకు విషాదాంతంగా ముగియడం బాధాకరం.
