ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, గురువారం నాడు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అన్న వస్తున్నాడంటూ వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని, ఆ మాటలు విన్న ఏపీ ప్రజలు అన్న కాదు.. అవినీతి కొండ వస్తున్నాడంటూ చర్చించుకుంటున్నారన్నారు. వైసీపీ నేతలు, నాయకులు ఏపీ అభివృద్ధికి అడ్డంకిగా మారారన్నారు. రాయలసీమను రతనాలస ఈమగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే చెందుతుందన్నారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కావడం మా ఖర్మ అంటూ వ్యంగ్యాస్ర్తాలు విసిరారు.
see also : శేఖర్‌రెడ్డి నోరు విప్పితే.. తండ్రి కొడుకులకు చిప్పకూడే..!!
see also : వైసీపీలో చేరిన…టీడీపీ..కాంగ్రెస్ ..జనసేన నేతలు…!
చంద్రబాబు నీతివంతమైన పాలన అందించగలడు కాబట్టే 2014 ఎన్నికల్లో టీడీపీని గెలిపించారని, అలాగే, 2019లోనూ టీడీపీనే అధికారంలోకి వస్తుందన్నారు. అనంతపురం జిల్లాలో ఎప్పుడూ లేనంతగా నీటి నిల్వలు పెరిగాయని, ఇందుకు కారణం సీఎం చంద్రబాబు ఆలోచనా విధానమేనని, ముందుచూపుతో హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులను పూర్తి చేశారన్నారు. దీంతో 40 టీఎంసీల నీటితో అనంతపురం సస్యశ్యామలం అయిందన్నారు. రాయల సీమలో కియా మోటార్స్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చంద్రబాబు తీవ్రంగా కృషి చేశారన్నారు. దీంతో అనంతపురం ప్రజలు ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లేపని తప్పిందన్నారు.