ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, శుక్రవారం మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ గోడమీద పిల్లి రెండూ ఒకటేనన్నారు. వైఎస్ జగన్ అవసరం అయితే, కాంగ్రెస్‌తో కలవకలడు, అదే సమయంలో బీజేపీతోనూ కలవగలడు అంటూ ఎద్దేవ చేశారు. వైఎస్ జగన్‌పై వందలకొద్దీ రౌడీయిజం కేసులు ఉన్నాయన్నారు.
see also : ఆ హీరో సినిమాలో ఛాన్స్ కోసం..టాప్ హీరోయిన్లలో ఒకరు..పడక సుఖం
తనపై ఉన్న కేసులను కొట్టివేయించుకునేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మోడీ కాళ్లు పట్టుకోవడం జగన్‌కే చెల్లిందన్నారు. కాబట్టి ప్రతిపక్ష పాత్ర రోల్ ప్లే చేసే దమ్ము వైఎస్ జగన్‌కు లేదన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్ష కోట్లు దోపిడీ చేసి 17నెలలు జైల్లో ఉండి, 12 కేసుల్లో ముద్దాయిగా ఉండి, ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లేటటువంటినేర పూరిత చర్యల వల్ల వైఎస్ జగన్ పేరు ఏపీ, దేశంలోని కొంతమందికి తెలిసిందన్నారు. అటువంటి వ్యక్తి చంద్రబాబును విమర్శించడానికి అర్హుడు కాదని అన్నారు.