ఏపీలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పెద్ద కుమారుడు నాగార్జునరెడ్డి (28) ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం తన నివాసంలో నాగార్జునరెడ్డి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాటసాని ఇంటి వద్దకు భారీగా వైసీపీ కార్యకర్తలు,అభిమానులు చేరుకుంటున్నారు.
