వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా.. ఆ ప్రాంత ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్‌పై పూల వర్షం కురిపిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారిలో భరోసాను నింపుతూ .. సమస్యలకు పరిష్కారాన్ని కనుగొంటూ ముందుకు సాగుతున్నారు.
see also:ప్రోటో కాల్ కూడా తెలియని నీవు.. మంత్రివా..??
అయితే, పాదయాత్ర చేస్తున్న జగన్ కు తూర్పు గోదావరి ప్రజలు ఘన స్వాగతాలు పలుకుతున్నారు. ఒక్కో గ్రామ ప్రజలు ఒక్కో రీతిలో స్వాగతం పలుకుతున్నారు. అందులో డప్పు కళాకారులు కూడా వారి కళారూపాన్ని ప్రదర్శిస్తూ జగన్‌కు స్వాగతం పలికారు.