బ్రాహ్మణి తీరుపై విమర్శల వర్షం..! – Dharuvu
Home / 18+ / బ్రాహ్మణి తీరుపై విమర్శల వర్షం..!

బ్రాహ్మణి తీరుపై విమర్శల వర్షం..!

నారా బ్రాహ్మణిపై విమర్శల వర్షం కురుస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి నారాలోకేశ్ ఓ కుటుంబ కార్యక్రమం మాదిరిగా ఇంటి ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అలాగే బ్రాహ్మణి కూడాఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోకేశ్ ఒకమంత్రిగా ప్రజలసమక్షంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం మంచిదే కానీ ఓ కుటుంబ కార్యక్రమం మాదిరిగా ఇంట్లో ఆ కార్యక్రమం చేయడంవ అందునా పోలీసు అధికారులు బ్రాహ్మణికి సెల్యూట్ చేస్తుండడం పట్ల విమర్శలు వినిపిస్తున్నారు.

లోకేశ్ మంత్రి అయ్యిందే దొడ్డిదారిన.. ఆయనకు ఎవ్వరూ నాయకునిగా ఎన్నుకోలేదు.. ఇప్పుడు చాలదన్నట్టు ఆయన భార్య కూడా పోలీసుల సెల్యూట్ స్వీకరిస్తారని ప్రశ్నిస్తున్నారు. దీంతో నిన్ననే రాహుల్ ని కలిసి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిన బ్రాహ్మణి రెండోరోజూ ఈ ఘటనతో విమర్శలెదుర్కొంటున్నారు.