Home / ANDHRAPRADESH / రహదారిపై లారీ డ్రైవర్లకు వల వేసి అమ్మాయి చేసే పని చూసి షాకైయిన పోలీసులు..!

రహదారిపై లారీ డ్రైవర్లకు వల వేసి అమ్మాయి చేసే పని చూసి షాకైయిన పోలీసులు..!

ఏపీలో వ్యభిచారం పేరుతో బేరాలు, సారాలు… ఆపై పొదల్లోకి తీసుకెళ్లి అనుచరులతో కలిసి నిలువు దోపిడీ… ఈ తరహాలో కొంత కాలంగా దోపిడీలు చేస్తున్న కిలాడీ లేడీ తో పాటూ అనుచరులు మరో ముగ్గురిని నెల్లూరులోని వేదాయపాళెం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అందమైన వస్త్రధారణ… ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ముఖానికి మేకప్‌ …. జాతీయ రహదారిపై నిల్చని హొయలు ఒలికిస్తూ లారీ డ్రైవర్లకు వల వేస్తున్న కిలాడి లేడి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే…బుధవారం ఉదయం నగర డిఎస్‌పి మురళీకృష్ణ వేదాయపాళెం పోలీస్‌ స్టేషన్‌ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. నెల్లూరు మండలం, ఆమంచర్ల గ్రామానికి చెందిన మల్లి శ్రీనివాసులు, నగరంలోని టీచర్స్‌ కాలనీకి చెందిన వీరేశం బాలవర్ధన్‌, రాంనగర్‌ కు చెందిన మట్టెంపాటి అనీల్‌ లు స్నేహితులు. వీరు ముగ్గురూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఈ ముగ్గురిలో ఒకరైన మట్టెంపాటి అనీల్‌ కు, సంతపేటకు చెందిన కమతం రమాదేవి కి అక్రమ సంబంధం ఉంది. వీరు చెడు వ్యసనాలకు అలవాటు పడి ఆటో ద్వారా వచ్చే ఆదాయం సరిపోక అడ్డదారి తొక్కారు. రమాదేవి తో కలిసి జాతీయ రహదారి పై దోపిడీలు మొదలుపెట్టారు. రమాదేవి అందంగా ఉండే విధంగా మేకప్‌ వేయించి జాతీయ రహదారిపై నిలబెట్టి ఈ ముగ్గురు మాత్రం దూరంగా ఎవ్వరికీ కనిపించకుండా ఉంటారు. జాతీయ రహదారిపై వెళ్లే డ్రైవర్లు రమాదేవి ని చూసి ఆకర్షితులై వ్యభిచారం కోసం లారి దిగి పొదల్లోకి వెళ్లగానే నలుగురు కలిసి డ్రైవర్‌ పై దాడి చేసి వారి వద్ద ఉండే నగదును బలవంతంగా లాక్కొని ఆటోలో పరారయ్యేవారు. దూర ప్రాంత డ్రైవర్లు పరువుపోతుందని ఈ విషయాలపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వెళ్లిపోయేవారు. ఇదే క్రమంలో.. ఈ నెల 7 వ తేదీ తెల్లవారు జామున నగర శివారు సుందరయ్య కాలనీ బ్రిడ్జి దాటిన తర్వాత, రమాదేవి ఖమ్మం జిల్లాకు చెందిన బత్తల శివాజీ అనే లారీ డ్రైవర్‌ ను ఆకర్షించి పొదల్లోకి తీసుకెళ్లింది. అప్పటికే అక్కడున్న మల్లి శ్రీనివాసులు, వీరేశం బాలవర్ధన్‌, మట్టెంపాటి అనీల్‌ తో కలిసి డ్రైవర్‌ పై దాడి చేసి అతని వద్ద ఉన్న పర్సులోని 5 వేల రూపాయలను, వెండి బ్రాస్లెట్‌, వెండి ఉంగరంను దోచుకుని పరారయ్యారు. దీనిపై డ్రైవర్‌ బత్తల శివాజీ నెల్లూరులోని వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జాతీయ రహదారిపై నిఘా ఉంచిన పోలీసులు బుధవారం తెల్లవారు జామున సుందరయ్య కాలనీ సమీపంలో గస్తీ నిర్వహించారు. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న ఈ నలుగురిని విచారించగా.. ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు తేలింది. దీంతో నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 3 వేల రూపాయల నగదు, వెండి ఉంగరం, వెండి బ్రాస్లెట్‌, టార్చ్‌ లైట్‌, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నలుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించినట్లు డిఎస్‌పి పేర్కొన్నారు. ఈ సమావేశంలో వేదాయపాళెం సిఐ నరసింహారావు, ఎస్సై పుల్లారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat