Breaking News
Home / ANDHRAPRADESH / తిరుమల బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచార దుర్మార్గపు చర్యపై స్పందించిన విశాఖ శారదాపీఠాధిపతి

తిరుమల బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచార దుర్మార్గపు చర్యపై స్పందించిన విశాఖ శారదాపీఠాధిపతి

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచారం జరగడంపై విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్పందించారు. హిందూ మనోభావాలను దెబ్బతీసే ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేయడాన్ని ఇప్పటికే సిఎస్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కుట్రకు బాధ్యులెవరో ప్రభుత్వం నిగ్గు తేల్చాలని అన్నారు. హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ గతంలో వైఎస్సార్ జీవో జారీ చేసారని, వైఎస్ జారీ చేసిన జీవోను ముఖ్యమంత్రి తక్షణం సమీక్షించాలి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు.