Home / ANDHRAPRADESH / టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మరో సంచలన నిర్ణయం…సర్వత్రా ప్రశంసలు…!

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మరో సంచలన నిర్ణయం…సర్వత్రా ప్రశంసలు…!

తిరుమల తిరుపతి ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో టీటీడీ బోర్డు ఏర్పడనప్పటికీ వైవీ సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో పలు విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారు. తొలుత ఎల్1 ఎల్2 వంటి విఐపీల బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. దీంతో సాధారణ భక్తులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే తిరుమలలో కాలుష్య నివారణ నిమిత్తం బ్యాటరీ కార్లను ప్రవేశపెట్టేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నారు. తాజాగా వైవీ సుబ్బారెడ్డి మరో గొప్ప నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. తిరుమలకు ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు విచ్చేస్తుంటారు. దీంతో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్ల వినియోగం ఎక్కువగా ఉంది. అయితే తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్ కవర్ల వాడకంపై నిషేధం విధించారు. కానీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అమ్మకం మాత్రం సాగుతోంది.ముఖ్యంగా గెస్ట్‌హౌస్‌లు, , కాటేజీలకు పక్కగా వెనుకగా ఉండే నిర్మానుష్య ప్రాంతాలు ప్లాస్టిక్ సీసాలకు డంప్ యార్డుల్లాగా మారుతున్నాయి. ఈ ప్లాస్టిక్ బాటిల్స్‌ తిరుమల గిరులపై పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయి. దీంతో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మరో గొప్ప నిర్ణయం తీసుకుంటున్నారు…ఇక నుంచి తిరుమలలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ‌పై నిషేధం విధించబోతున్నారు. అయితే భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్‌ను అందించే కేంద్రాలను ఏర్పాటు చేయాలని వైవీ సుబ్బారెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే తిరుమలకు ఏడుకొండల వాడి దర్శనార్థం విచ్చేసే భక్తులకు తరిగొండ వేంగమాంబ నిత్యాన్నదానసత్రంలో ఉదయం టిఫినుతో పాటు, మధ్యాహ్నం, రాత్రి వేళ్లలో భోజనం ఉచితంగా పెడుతున్నారు. ఇదే తరహాలో.. తాగునీటిని కూడా పూర్తిగా టీటీడీ ద్వారా ఉచితంగా అందించే ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. తిరుమల గిరులు మరింతగా పర్యావరణహితంగా మారుతాయనడంలో సందేహం లేదు. మొత్తంగా తిరుమలలో వాటర్ బాటిళ్లను నిషేధిస్తూ వైవీ సుబ్బారెడ్డి తీసుకున్న గొప్ప నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat