Breaking News
Home / ANDHRAPRADESH / దెందులూరు మాజీ ఎమ్మెల్యే అరెస్ట్… ఏలూరు త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలింపు…!

దెందులూరు మాజీ ఎమ్మెల్యే అరెస్ట్… ఏలూరు త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలింపు…!

అట్రాసిటీ కేసులో ఏలూరు పోలీసుల కళ‌్లగప్పి పారిపోయిన టీడీపీ వివాదాస్పద నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో పోలీసులు చింతమనేని కోసం తీవ్రంగా వెదికి..చివరకు ఇవాళ దుగ్గారాలలో అరెస్ట్ చేశారు. దళితులను కులం పేరుతో దూషించాడంటూ ఇటీవల చింతమనేనిపై అట్రాసిటీ కేసు నమోదు అయింది. దీంతో తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను ఏమార్చి చింతమనేని పరారీ అయ్యాడు. అయితే ఇవాళ తన భార్యకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమెను చూసేందుకు దుగ్గిరాలలోని తన నివాసానికి వెళ్లాడు. చింతమనేని ఆచూకీ తెలుసుకున్న పోలీసులు ఆయన్ని ఇంట్లోనే అరెస్ట్ చేసి, ఏలూరు త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇవాళ చింతమనేని అరెస్ట్‌కు ముందు ఆయన ఇంటి ముందు తీవ్ర ఉద్రికత్త నెలకొంది. ఇవాళ చింతమనేని ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులను ఆయన అనుచరులను అడ్డుకుని తీవ్ర వాగ్వివాదానికి దిగారు. కాగా చింతమేనిపై ఈ అట్రాసిటీ కేసుతో పాటు, మొత్తం 49 కేసులు నమోదు అయ్యాయి. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు టీడీపీ మళ్లీ అధికారంలోకి రాదనే భయంతో చంద్రబాబు, లోకేష్‌ల సహాయంతో 23 కేసులను చింతమనేని ఎత్తేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. సో.. అట్రాసిటీ కేసుతో పాటు పలు కేసుల్లో ఆధారాలు బలంగా ఉండడంతో చింతమనేని జైలుకు పోవడం ఖాయమని ప.గో. జిల్లాలో చర్చ జరుగుతోంది.