Home / ANDHRAPRADESH / సీఎం జగన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!

సీఎం జగన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి దాదాపు లక్షా పాతికవేలకు పైగా గ్రామవాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇటీవల పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేసింది. అర్హత సాధించిన అభ్యర్థులకు కాల్‌లెటర్స్ పంపుతోంది. కాగా సచివాలయ ఉద్యోగాల ఫలితాల అనంతరం చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయని, ఏపీపీపీయస్సీలోనే ఈ లీకేజీ బాగోతం జరిగిందని, లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక కొన్ని టీడీపీ అనుకుల మీడియా ఛానళ్లు, పతిక్రలు కూడా పేపర్ లీక్ అయిందంటూ..కథనాలు వండివారుస్తున్నాయి. ప్రస్తుతం లీకేజీ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. తాజాగా సచివాలయం పరీక్ష పేపర్ లీక్‌పై చంద్రబాబు సీఎం జగన్‌‌కు ఆదివారం నాడు ఓ లేఖ రాశారు. పేపర్ లీక్ అయిందంటూ వస్తున్న వార్తల నేపథ‌్యంలో తక్షణమే సచివాయ పరీక్షలను రద్దు చేసి పారదర్శకంగా మళ్లీ పరీక్షలు నిర్వహించాలని బాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన దానికి బాధ్యత వహించి మీరు రాజీనామా చేస్తారా..లేక మీ పంచాయతీరాజ్, విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేస్తారో మీ మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ లేఖలో చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆక్షేపించారు. అర్హులైన వారికే ఉద్యోగాలు దక్కేలా చూడాలి. ఈ పాపానికి బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేయాలి’ అంటూ చంద్రబాబు సీఎం జగన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. కాగా గత ఐదేళ్లలో యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని చంద్రబాబు..ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దాదాపు 4 లక్షల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి…ఒకేసారి లక్షా పాతికవేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయడాన్ని జీర్ణించుకోలేకే… ఇలా పేపర్ లీకేజీ అంటూ ప్రభుత్వంపై బురద జల్లుతున్నాడంటూ…వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మొత్తంగా పేపర్ లీక్ అంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరి చంద్రబాబు లేఖపై సీఎం జగన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat