Home / ANDHRAPRADESH / బ్రేకింగ్..వారికి కటాఫ్ తగ్గింపు..కొత్తగా మరికొంత మందికి కాల్‌లెటర్స్.. !

బ్రేకింగ్..వారికి కటాఫ్ తగ్గింపు..కొత్తగా మరికొంత మందికి కాల్‌లెటర్స్.. !

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒకేసారి 1.36 లక్షల సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఏపీ సీఎం జగన్ స్వయంగా సచివాలయ ఉద్యోగాల పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు కూడా అందించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అక్టోబర్ 2 న గాంధీ జయంతిని పునస్కరించుకుని తూగోజిల్లాలోని కరప గ్రామంలో గ్రామసచివాలయ వ్యవస్థను ప్రారంభించి, స్వపరిపాలనలో నూతన శకానికి నాందిపలికారు. అయితే తాజాగా సచివాలయ పరీక్ష రాసిన అభ్యర్థులకు సీఎం జగన్ మరో వరాన్ని ప్రకటించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సచివాలయ ఉద్యోగ నియామకాల్లో క్వాలిఫై మార్కులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రాతపరీక్షల్లో క్వాలిఫై మార్కులను తగ్గించారు. దీంతో ఎస్పీ, ఎస్టీ కేటగిరిలో అర్హత సాధించలేకపోయిన మరికొంత మంది అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కనున్నాయి. వివరాల్లోకి వెళితే గ్రామ సచివాలయ ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన పోస్టులకు గాను నిర్వహించిన రాత పరీక్షల్లో.. ఆయా కేటగిరీల అభ్యర్థులు కనీస మార్కులు తెచ్చుకోలేక పోయారు. దీంతో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులు తగ్గించి, ఆ పోస్టులను భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. కాగా సచివాలయ ఉద్యోగ రాతపరీక్షల్లో ఓసీలకు 60, బీసీలకు 52.50, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హత మార్కులుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే.. పలు జిల్లాల్లో వివిధ రకాల ఉద్యోగాల రాతపరీక్షల్లో కనీస అర్హత మార్కులు తెచ్చుకున్న వారు తగినంత మంది లేక ఖాళీలు మిగిలిపోయాయి. దీంతో.. ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాల్లో పోస్టులవారీగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను తగ్గించి సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సమాచారం పంపుతున్నారు. ఈ పోస్టులను ఈ నెల 14లోపు ముగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇదిలా ఉంటే ఎస్సీ, ఎస్టీలతో పాటు పలు జిల్లాల్లో వివిధ రకాల ఉద్యోగాలు బీసీ.. జనరల్‌ కేటగిరీల్లో మిగిలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అక్టోబర్‌ 15న జిల్లాల వారీగా జనరల్, బీసీ కేటగిరీల్లో మిగిలిపోయే పోస్టుల వివరాలను ప్రభుత్వం ముందు ఉంచనున్నట్టు అధికారులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ, జనరల్ కేటగిరిలో కూడా కటాఫ్ మార్కులు తగ్గిస్తే మరికొంత మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా ఎస్సీ, ఎస్టీలతో పాటు, బీసీ, జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు కూడా కటాఫ్ మార్కులు తగ్గించేందుకు సీఎం జగన్ మొగ్గు చూపే అవకాశం ఉంది. మొత్తంగా సీఎం జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలు రాసి, అర్హత సాధించలేకపోయిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులలో మరి కొంతమందికి ఉద్యోగాలు దక్కనున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat