Home / ANDHRAPRADESH / బ్రేకింగ్.. జనవరిలో ఒకేసారి 45 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!

బ్రేకింగ్.. జనవరిలో ఒకేసారి 45 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!

ఏపీ నిరుద్యోగ యువతకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే 1.34 లక్షల గ్రామవాలంటీర్ల పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుకగా ఒకేసారి దాదాపు 45 వేల ఉద్యోగాల భర్తీ చేయనుంది. ఈ మేరకు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరిలో ఒకేసారి 44,941 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. పోస్టుల వారీగా చూస్తే గ్రూప్-2 లో 1000 పోస్టులు, పోలీస్ డిపార్ట్ మెంట్ లో 13,591 , డీఎస్సి లో 20,000 పోస్టులు, అటవీ శాఖలో 2,750 పోస్టులు, గ్రూప్-4 లో 2,600 పోస్టులు, ఇతర ఉద్యోగాలు 5000 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా జనవరిలో ఒకేసారి 44, 941 పోస్టుల భర్తీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల గ్రామవాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను పంచాయతీ రాజ్ శాఖ భర్తీ చేసింది. ఇప్పుడు ప్రకటించిన 44, 941 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. మొత్తంగా వరుసగా ఉద్యోగాల జాతరతో ఏపీ యువత హర్షం వ్యక్తం చేస్తోంది. చూశారుగా…ఒకేసారి 45 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తోంది..ఎంచక్కా ప్రిపేర్ అయి ఉద్యోగాలు సాధించండి..ఆల్ ద బెస్ట్.