Home / ANDHRAPRADESH / టీటీడీలొ రమణ దీక్షితులు రీ ఎంట్రీపై చంద్రబాబు అక్కసు..!

టీటీడీలొ రమణ దీక్షితులు రీ ఎంట్రీపై చంద్రబాబు అక్కసు..!

తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులును టీటీడీ ఆగమ సలహాదారునిగా జగన్ సర్కార్ నియమించింది. అయితే టీటీడీలో రమణ దీక్షితులు రీ ఎంట్రీ ఇస్తే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నాడు. తాజాగా చిత్తూరు పర్యటనలో ఉన్న చంద్రబాబు రమణ దీక్షితులు, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుమల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎన్నో ఆరోపణలు వచ్చిన ఆయనను ఆగమ శాస్త్ర సలహాదారుడిగా నియమించటం ఏంటి అని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశాడు. అంతే కాదు రమణ దీక్షితులపై టీటీడీ వేసిన పరువు నష్టం దావా కూడా జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని అక్కసు వెళ్లగక్కాడు. ఇంతకీ రమణ దీక్షితులు మళ్లీ టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వడాన్ని చంద్రబాబు ఎందుకు సహించలేకపోతున్నాడు..అంటే పెద్ద కథే ఉంది. చంద్రబాబు హయాంలో రమణదీక్షితులు టీటీడీ ప్రధాన అర్చకులుగా ఉన్నారు. ఆ సమయంలో తిరుమలలో టీడీపీ పెద్దల చేతివాటాన్ని రమణ దీక్షితులు సహించలేకపోయారు. అప్పట్లో టీటీడీ అధికారులపై, చంద్రబాబుపై పలు ఆరోపణలు చేశారు. తిరుమల శ్రీవారికి సమర్పించే ప్లాటినం నెక్లెస్‌లో పింక్ డైమండ్ కనిపించడం లేదని..జెనీవాలో వెలివేసిన డైమండ్ స్వామివారిదే అని అనుమానంగా ఉందని రమణ దీక్షితులు అనుమానం వ్యక్తం చేశారు. అంతే కాదు సీఎం చంద్రబాబు ఆదేశాలమేరకే ఆగమశాస్త్రానికి విరుద్ధంగా లడ్డూలు తయారు చేసే పోటును మరమ్మత్తులు చేశారని, పోటు కింద గుప్త నిధి కోసమే మరమ్మత్తుల పేరుతో మూసివేసి, తవ్వకాలు జరిపారని..సంచలన ఆరోపణలు చేశారు. దీంతో బాబుసర్కార్ దేవాల అర్చకుల పదవీ విరమణ 65 సంవత్సరాలు దాటిందనే మిషతో రమణ దీక్షితులను టీటీడీ నుంచి బయటకు సాగనంపింది. అప్పడుు రమణ దీక్షితులు తనకు ఉద్వాసన పలకడంపై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పోరాడారు. అప్పడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ను కూడా రమణదీక్షితులు కలిశారు. కాగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో ప్రక్షాళన చేపట్టింది. తాజాగా టీటీడీ ఆగమ సలహాదారుడి పదవిని రమణ దీక్షితులకు కట్టబెట్టింది. రమణ దీక్షితులు మళ్లీ టీటీడీలోకి రీఎంట్రీ ఇస్తే..గత ఐదేళ్లలో జరిగిన అవినీతి బాగోతాలన్నీ బయటకు వస్తాయని..చంద్రబాబు ఉలిక్కిపడుతున్నాడు. అందుకే రమణమూర్తిని మళ్లీ టీటీడీలోకి ఎలా తీసుకుంటారంటూ బాబుగారు గగ్గోలు పెడుతున్నాడు. మొత్తంగా టీటీడీలో రమణ దీక్షితులు రీఎంట్రీ పట్ల మిగిలిన ప్రతిపక్షాలు స్పందించకున్నా..చంద్రబాబు మాత్రం గొంతు చించుకుని సీఎం జగన్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే..టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ నిధులు, స్వామివారి నగలు భారీగా మాయమైన విషయం బయటపడుతుందనే భయంతోనే..చంద్రబాబు వణికిపోతున్నాడని అర్థమవుతుంది. మొత్తంగా రమణ దీక్షితులు మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడని భయమా..లేకా పింక్ డైమండ్ రహస్యం బయటపడుతుందని వణుకా అంటూ..చంద్రబాబుపై వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.