టీడీపీ టెక్కలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు తృటిలో ప్రమాదం తప్పింది. నక్కపల్లి వద్ద డివైడర్‌ను అచ్చెన్నాయుడు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది.వేంటనే కారు బెలున్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. నక్కపల్లి జంక్షన్ వద్ద రాత్రి 10.15 గంటల సమయంలో అడ్డుగా వచ్చిన మోటారు సైకిల్‌ను తప్పించే ప్రయత్నంలో కారు డ్రైవర్ డివైడర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో అచ్చెన్నాయుడు చేతికి స్వల్ప గాయమైంది. ఆయన్ను వెంటనే నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం శ్రీకాకుళం బయల్దేరారు.