Home / ANDHRAPRADESH / నారావారి గొప్పలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్..!

నారావారి గొప్పలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్..!

ఏపీలో 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు రాజధానిలో రియల్‌ఎస్టేట్ భూమ్ పెంచడానికి నానాపాట్లు పడ్డాడు. అదిగో సింగపూర్‌‌ను తలదన్నే రాజధాని, ఇదిగో టోక్యో, అదిగదిగో షాంఘై, ఇదిగిదిగో ఇఫ్లాంబుల్, టర్కీ, లండన్, బుల్లెట్ ట్రైన్లు, కాసినోవాలు, అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లు..ఆహా..ఏపీ ప్రజలను కలల్లో విహరింపజేశాడు. నాలుగేళ్లపాటు గ్రాఫిక్స్‌ చూపించి ప్రజలను మభ్యపెట్టాడు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అంటూ ప్రజలు నవ్వుకుంటున్నా..తనదైన స్టైల్లో గొప్పలు చెప్పుకున్నాడు. పీవి సింధూ ఒలంపిక్స్‌లో రజతపతకం గెలిస్తే..నేనే బాడ్మింటన్ నేర్పించా అని గొప్పలు చెప్పుకున్నాడు..అంతే కాదు వచ్చే ఒలంపిక్స్ అమరావతిలోనేనని బిల్డప్ ఇచ్చాడు. అసలు ఒలంపిక్స్ బిడ్‌‌లో భారత్‌కే అవకాశం దక్కడం లేదు. అమరావతికి ఎలా ఛాన్స్ వస్తుందన్న మినిమం కామన్‌సెన్స్‌ లేకుండా డబ్బా కొట్టుకున్నాడు. అంతే కాదు ఎండాకాలంలో అమరావతిలో ఎండలు మండిపోతుంటాయి. ఇంకేముంది బాబుగారు ఓ అద్భుతమైన డైలాగ్ వేశాడు. హుధ్‌హుధ్ తుఫాన్‌‌ను ఒంటి చేత్తో ఆపాడు కదా మన బాబుగారు..అమరావతిలో ఎండలు తగ్గించాలని ఆర్డరేశాడు..అంతటితో ఆగాడా..ఇంటింటికి పైపులైన్ల ద్వారా ఏసీ చల్లదనాన్ని సరఫరా చేస్తానని మైండ్ బ్లాక్ చేశాడు.. ఇలా లేనిపోని గొప్పలు చెప్పి అమరావతిలో రియల్ఎస్టేట్ భూమ్ పెంచేసాడు.. కాని వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దీంతో రియల్‌ఎస్టేట్ రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది..ఓ దశలో స్థిరంగా కొనసాగుతున్న రియల్ఎస్టేట్ వ్యాపారం..బాబు డంబాచారాలు, హంగూ, ఆర్భాటాలు చూసి ఒక్కసారిగా ఎగసిపడింది. రాజధానిలో తన సామాజికవర్గం పెద్దల భూములు విలువలు పెరిగేందుకే చంద్రబాబు గ్రాఫిక్స్‌తో మాయచేసి, ప్రజలను ఊహాలోకాల్లోకి తీసుకువెళ్లాడు. దీంతో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా బాబు మాయలో పడి..భూముల విలువ అమాంతం పెంచేశారు. వందల కోట్ల పెట్టుబడులు పెట్టారు. అయితే ఐదేళ్లలో చంద్రబాబు రాజధానిలో కట్టింది నాలుగే నాలుగు తాత్కాలిక భవనాలు.. అమరావతిలో వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉండేసరికి రియల్‌ఎస్టేట్ రంగం మందగించింది. రియల్‌ఎస్టేట్ వ్యాపారులు రోడ్డున పడ్డారు. తమను రోడ్డు పడేసాడన్న కోపంతో అమరావతి పర్యటనకు వచ్చిన చంద్రబాబుపై ఓ రియల్‌ఎస్టేట్ వ్యాపారి రాళ్లతో దాడిచేశాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేయగా..చంద్రబాబు వల్లే మేము రోడ్డున పడ్డామని..అందుకే రాయివిసిరి తన నిరసన తెలిపానని తెలిపాడు. ఇదే విషయంపై ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..వచ్చే ఒలంపిక్స్ అమరావతిలోనేనని చెప్పాడు. ప్రపంచంలో ఎక్కడా మొదలే కాని ‘హైపర్ లూప్’ రవాణా వ్యవస్థ సిద్ధమవుతోందని చిటికెలేసాడు. ఇంటింటికి పైపులైన్ల ద్వారా ఏసీ చల్లదనాన్ని సరఫరా చేస్తామని అసాధ్యమైన కామెడీ వదిలాడు. ఈ గిమ్మిక్కులన్నీ రియల్ ఎస్టేట్ ధరలు పెంచడం కోసం కాక మరేమిటి? అంటూ సెటైర్ వేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్‌లో వైరల్‌గా మారింది.