Home / ANDHRAPRADESH / ఈ నెల 26న సూర్యగ్రహణం..తిరుమల, శ్రీశైలం ఆలయాల మూసివేత సమయాలు ఇవే…!

ఈ నెల 26న సూర్యగ్రహణం..తిరుమల, శ్రీశైలం ఆలయాల మూసివేత సమయాలు ఇవే…!

డిసెంబర్ 26 న సూర్యగ్రహణం కారణంగా కొన్ని గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం, శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున ఆలయాల మహాద్వారాలను కొన్ని గంటలపాటు మూసివేయనున్నారు. 26 న ఉదయం 8:08 గంటల నుంచి ఉదయం 11:16 గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుంది. దీంతో తిరుమల ఆలయ సంప్రదాయం ప్రకారం.. గ్రహణానికి 6 గం. ముందుగా అంటే 25 వ తేది రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులను మూసివేయనున్నారు. తిరిగి సూర్యగ్రహణం వీడిన తర్వాత అంటే 26 న మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. ఆలయ శుద్ధి అనంతరం మధ్యా హ్నం 2 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అలాగే, శ్రీశైలం ఆలయ మహాద్వారాలను ఈ నెల 26న కొన్ని గంటల పాటు మూసివేయనున్నారు. గ్రహణకాలం ముగిసిన తరువాత అదే రోజు ఉదయం 11:30 గంటలకు ఆలయ ద్వారాలు తెరవను న్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు భక్తులను భ్రమరాంబికామల్లన్న స్వామి దర్శనానికి అనుమతి ఇస్తారు. చూశారుగా..సూర్యగ్రహణం కారణంగా దాదాపు 12 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది కావున 26 న తిరుమల యాత్రకు వెళ్లేవారు ఈ విషయాన్ని గమనించగలరు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat