Home / ANDHRAPRADESH / చంద్రబాబు మచ్చలేని మనిషి..కొల్లు రవీంద్ర

చంద్రబాబు మచ్చలేని మనిషి..కొల్లు రవీంద్ర

తెలుగుదేశం పార్టీ అదినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మచ్చలేని మనిషి అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చంద్రబాబు మచ్చలేని మనిషనీ, పలు సందర్భాలలో ఐటీ రిటర్న్స్‌ను ప్రకటించిన నిజాయితీ పరుడని రవీంద్ర వ్యాఖ్యానించారు.. చంద్రబాబు అవినీతికి పాల్పడితే 9 నెలల పాటు వైసీపీ మంత్రులు ఏమి చేశారన్నారు. పేటీఎం బ్యాచ్‌ ఇష్టారాజ్యంగా అసత్య ఆరోపణలు చేస్తూ ఆనంద పడుతోందని కొల్లు విమర్శించారు.2 వేల కోట్ల రూపాయలకు సంబందించిన ఐటి ప్రకటనపై రాష్ట్ర మంత్రివర్గం యావత్తూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ జగన్‌ మెప్పు కోసం అర్రులు చాస్తున్నారని మరో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు.