ప్రకాశంజిల్లా కనిగిరిలో దారుణం….యువతిపై తన స్నేహితుడుతో అత్యాచారయత్నం చేయించిన లవర్ ఆ దృశ్యాల్ని వీడియో తీశాడు ..అంతటి తో ఆగని దుర్మార్గుడు ఆ దృశ్యాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు .గత నెలలో బాదితురాలితో సహా మరో ఇద్దరు అమ్మాయిలు , నిందితులు కార్తీక్ ,సాయి , పవన్ సరదాగా పొలాల్లోకి వెళ్లారు ..అయితే బాదితురాలికి లవర్ అయిన కార్తిక్ లో మృగం బయటకు వచ్చాడు ….తన స్నేహితుడైన సాయిని తన లవర్ పై అత్యాచారం చేయాల్సిందిగా పురమాయించినట్లు తెలుస్తోంది..దీంతో రెచ్చిపోయిన సాయి యువతి పై మృగం లా ప్రవర్తించాడు ..ఆ దృశ్యాల్ని లవర్ కార్తీక్ వీడియో తీసాడు ..పక్కన పవన్ అనే మరో స్నేహితుడు సహకరించాడు ….సోషల్ మీడియాలో ఆ దృశ్యాలు వైరల్ కావడంతో బాదితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది.. సెక్షన్ 366, 354,354 B,60,60A కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశామని కనిగిరి సిఐ తెలిపారు.
