Home / ANDHRAPRADESH / హత్యల వెనుక బలమైన కుట్ర

హత్యల వెనుక బలమైన కుట్ర

ఒంగోలు జిల్లాలో సంచలనం సృష్టించిన దంపతుల హత్య కేసు నిందితులను పోలీసు అధికారులు శనివారం తమ కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారమే కస్టడీకి తీసుకున్నా శనివారం నుంచి వారిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఎస్పీ బి.సత్య ఏసుబాబు ఆధ్వర్యంలో ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు, ఒన్‌టౌన్‌ సీఐ ఫిరోజ్‌ల ఆధ్వర్యంలోని బృందం విచారణ చేపట్టింది. జిల్లా జైలులో ఉన్న నిందితులు లక్కే శ్రీనివాసులు, సెప్టింక్‌ ట్యాంకుల ఓనర్‌ సింథే కుమార్, ఎనిమిశెట్టి సుబ్బుమ్మ అలియాస్‌ సుబ్బులును పోలీసు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. సెప్టెంబర్‌ 28వ తేదీ రాత్రి 8.30 గంటల నుంచి 11 గంటల్లోపు ఒంగోలు నగరానికి చెందిన వ్యాపారి పల్లపోతు శ్రీనివాసరావు, ప్రమీలారాణిలను ఒకరి తర్వాత మరొకరిని హత్య చేసిన సంఘటన తెలిసిందే.

హత్య అనంతరం ప్రమీలారాణి శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు ఏమయ్యాయో కూడా తెలియడం లేదు. స్థానిక ఇస్లాంపేటలో నివాసం ఉంటున్న పల్లపోతు దంపతులు ప్రధానంగా కమీషన్‌ పద్ధతిలో పాత ఇనుము వ్యాపారం చేస్తుంటారు. దీంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, వడ్డీ వ్యాపారం వంటివి కూడా చేస్తూ ఉండేవారు. శ్రీనివాసరావుతో పాటు భార్య ప్రమీలారాణి కూడా ఆర్థిక లావాదేవీల్లో చురుకుగా వ్యవహరించేది. దంపతులకు వ్యాపార లావాదేవీల్లో భాగంగా ప్రధాన నింధితుడు బాగా సన్నిహితంగా మెలిగేవాడు. ఇదిలా ఉంటే రోజూ రూ.లక్షల్లో చేతులు మారే వ్యాపారాలు. పాత ఇనుము వ్యాపారమే నెలకు రమారమి రూ.కోటి వరకు ఉంటుందన్నది సన్నిహితుల నుంచి వచ్చిన సమాచారం. ఇక వడ్డీ వ్యాపారం, స్థిరాస్థి వ్యాపారాలు కూడా అడపాదడపా చేస్తుంటారు.

 

హత్యల వెనుక బలమైన కుట్ర
వ్యాపార వర్గానికి చెందిన కుటుంబం కావడంతో పాటు జిల్లాకు చెందిన మంత్రి సామాజికవర్గమే కాకుండా ఆయన కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగిన దంపతులను ఒక్కసారిగా హతమార్చటం అంటే దీని వెనుక బలమైన కారణాలు కూడా ఉన్నాయన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దక్షిణ భారతదేశం యాత్ర, యూరప్‌ టూర్‌కు వెళ్తూ దంపతులు వ్యాపార సన్నిహితులైన కొందరి వద్ద బోలెడు నగదు, బంగారు ఆభరణాలు దాచి వెళ్లారన్న సమాచారం వ్యాపార వర్గాల్లో హల్‌చల్‌ చేస్తోంది. మరి వ్యాపారం కోసం ఎంతమందికి ఎన్ని రూ.లక్షల్లో అడ్వాన్సులు ఇచ్చి ఉన్నారో తెలియ రావడం లేదు. ఎలాంటి ఆర్థిక లావాదేవీలైనా దంపతుల మధ్యే ఉంటుంది. అందుకే హంతక ముఠా ముందు భర్త శ్రీనివాసరావును ఆ తర్వాత భార్య ప్రమీలారాణిని హతమార్చారని స్పష్టమవుతోంది.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat