వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కొత్త సంప్రదాయం పెట్టారు. ఆయన తన నియోవజకవర్గంలోని అదికారులు, జడ్పిటిసి,ఎమ్.పిటిసిసర్పంచ్ లు వార్డు సబ్యులు తదితరులందరికి కొత్త దుస్తులు పెట్టారు. దీపావళి సందర్భంగా ఆయన వారందిరికి కానుకలు అందించారు. ఇందుకోసం చెవిరెడ్డి సుమారు 35 లక్షల రూపాయలు వ్యయం చేశారట. ప్రతి ఏటా ఆయన ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్తున్నారట. త్యేకంగా 25 బృందాలను ఏర్పాటు చేసి మంగళవారం ప్రతి ఇంటికీ వెళ్లి పంపిణీ చేశారు. మొత్తం 6,100 మందికి నూతన వస్త్రాలను పంచిపెట్టి కుటుంబంలో ప్రతి ఒక్క రూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలు, సిరి సంపదలతో ఉండాలని కోరుకున్నారు.