ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిజ స్వరూపాన్ని మరోసారి బయట పెట్టారు విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. కాగా, ఈ రోజు ఓ ఛానెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే, నాడు ఏపీ మంత్రివర్గ విస్తరణలో భాగంగా చోటు దక్కకపోవడంతో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అలకబూనిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. ఆ రోజున తాను అన్న (నమ్ముకున్న పార్టీయే (మా సామాజిక వర్గానికి) కాపుల గొంతు కోశారన్న) మాట వాస్తవమేనని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. అప్పటి పరిస్థితులను బట్టి.. తాను మంత్రి పదవిని ఆశించినట్లు తెలిపారు. అందులోనూ చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇవ్వలేదన్నారు. అందుకు తాను బాధపడ్డ మాట వాస్తవమేనని పేర్కొన్నారు. అయితే టీడీపీ పార్టీని గానీ, మా నాయకుడ్ని గానీ, ఒక్క మాట మాట్లాడి ఉంటే రాజకీయాల నుంచి విత్‌డ్రా చేసుకుంటానని చెప్పుకొచ్చారు.
అయితే, తాను ఇప్పటి వరకు పార్టీ గురించి కానీ.. లేక చంద్రబాబు గురించి కానీ.. లేకుంటే ఆయన ఫ్యామిలీ గురించి కానీ.. ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. చంద్రబాబు మీకు వార్నింగ్ ఇచ్చారట కదా! అన్న యాంకర్ ప్రశ్నకు.. చంద్రబాబు నాకు వార్నింగ్ ఇస్తుండగా ఎవరైనా చూశారా? అని ఎదురు ప్రశ్నించారు ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు. అధినేత నాకు క్లాస్ పీకాక నేను సైలెండ్ అయ్యాననడం కరెక్ట్ కాదన్నారు. తనకు పని చేసుకుంటూ వెళ్లడమే తప్ప .. పదవులు అడిగింది లేదని పేర్కొన్నారు.
గతంలో ఆర్టీఐ ఆఫీసులో దాడి గురించి ఆయన మాట్లాడుతూ.. నేను ఆ సమయంలో నెట్టిన అతను కానిస్టేబుల్ అని తనకు తెలియదన్నారు. ఆ ఘటనకు సంబంధించి వెంటనే కమీషనర్‌కు సారీ కూడా చెప్పానని, కబ్జా, బెదిరింపుల ఆరోపణలు నాకు చెడ్డ పేరు తేవాలని కొందరు చేసే ప్రచారమేనని, తనపై ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు.