ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలు ఎండగట్టడమే లక్ష్యంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రజాసంకల్పయాత్ర చేపట్టినట్లు తెలిసిందే. గురువారం 10వరోజు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో బైపాస్ రోడ్డులో గురువారం ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బస్ లో నుంచి ఒక మహిళ షేకండ్ కోసం చేయ్యి ఇవ్వగా జగన్ షేకండ్ అందచేశాడు. అలా మహిళ కు వైఎస్ జగన్ షేకండ్ ఇవ్వడంతో ఆనందంతో మహిళ ఇంత సాదరణమైన వ్యక్తి మన రాష్ట్రానికి సీయం అయితే మన సమస్యలు,భాదలు తెలుసుకోని ఖచ్చితంగా న్యాయం చేయగలడని తోటి ప్రయాణికులతో చేప్పినట్లు సమచారం.
