Home / ANDHRAPRADESH / చలించిపోయిన జగన్ -వెంటనే రూ.2.30 కోట్లు చెల్లిస్తామని హామీ..

చలించిపోయిన జగన్ -వెంటనే రూ.2.30 కోట్లు చెల్లిస్తామని హామీ..

ఏపీలో కృష్ణాజిల్లాలో పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెల్సిందే .ఈ సంఘటన మీద ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు .ఈ సందర్భంగా ఈ ఉదాతంతం తెల్సిన వెంటనే ఆయన చలించిపోయారు .ఈ క్రమంలో జగన్ ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఈ రోజు గురువారం ఫోన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ “ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని రైతులకు ఆయన ధైర్యం చెప్పారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం తరఫున రూ.2.30 కోట్లు చెల్లిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. ఆ చెల్లింపులన్నీ వెంటనే చేస్తాం అని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని తన మాటగా నష్టపోయిన రైతులకు చెప్పాలన్నారు. అఘాయిత్యాలకు పాల్పడి కుటుంబాల్లో కన్నీళ్లు నింపొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే… రైతులను కాపాడాల్సిన ప్రభుత్వం వారిని వేధింపులకు గురిచేయడంపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతుల తమ వేదనను రాజన్న తనయుడికి వెలిబుచ్చారు…

దాదాపు ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నామని, నకిలీ నార కారణంగా పంట నష్టపోయామని అప్పట్లో ధర్నా చేశామని, నార నకిలీదని శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారని అన్నారు. ఎకరాకు రూ.91వేలు చెల్లించేలా కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారని, కాని చెల్లింపులు జరగలేదన్నారు. కంపెనీల యజమానులు కోర్టుకు వెళ్లి కలెక్టర్‌ ఉత్తర్వులు కొట్టేయించుకున్నారని, ఈ విషయాన్ని మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డికి నాలుగుసార్లు నివేదించామని, మరో మంత్రి దేవినేని ఉమకి రెండుసార్లు విన్నవించామని, గత ఏడాది అసెంబ్లీకి
వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేదుని ఈ క్రమంలో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat