ఏపీలో 2019 లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారం దక్కించుకోవడం ఖాయమని, అందులో సందేహం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. టీడీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెదేపాకు ఎన్ని సీట్లు వస్తాయన్నది కాదని, ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు తగ్గించగలిగామన్నదే ముఖ్యమని నేతలకు హితబోధ చేశారు. ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం లేదనే విషయాన్ని తాజా అసెంబ్లీ సమావేశాల ద్వారా నిరూపించామన్నారు. ప్రజా సమస్యలపై అధికార పక్షంగా తామే స్పందిస్తున్నామని, పోలవరంపై కేంద్రం రాసిన లేఖపైనా తామే మొదట స్పందించామని చంద్రబాబు అన్నారు.
