ఏపీ రోజు రోజుకు రాజకీయం వెడెక్కుతంది. అధికార ..ప్రతిపక్షలు ఓక్కోసారి వారు చేసే వాఖ్యలు వారి నాయకుల మీద పడే అవకాశం ఉంటుంది. అచ్చం అలాంటిదే టీడీపీలో జరిగింది. చంద్రబాబుపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. అసలు ఆయన ఏమన్పారంటే చంద్రబాబు కాకుండా మరొకరైతే ఈపాటికి సీఎం పదవిని వదిలేసి పారిపోయేవారు, ఏపీని పాలించే సత్తా ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉందని ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారని చెప్పారు.
చంద్రబాబు కాకుండా మరొకరు సీఎంగా ఉంటే ఎదురైన సవాళ్లను చూసి ఈపాటికి రాజీనామా చేసి వెళ్లిపోయేవారని అచ్చెన్న వివరించారు. అచ్చెన్న వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.నిజమే చంద్రబాబు కాబట్టే ఓటుకు నోటు కేసు తర్వాత కూడా సీఎం కుర్చీలో ఉండగలిగారని జోకులేస్తున్నారు. పట్టపగలు ఎమ్మెల్యేలను కొంటూ నోట్ల కట్టలతో ఆడియో, వీడియో టేపుల్లో దొరికి కూడా కేసు లేకుండా సీఎంగా ఉండడం అంటే ప్రపంచంలో ఏ నేతకూ సాధ్యం కాని పనే! ఢిల్లీకి తిరుమల లడ్డూలతో వెళ్లి అన్నివ్యవస్థలను మేనేజ్ చేసిన విధానం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం! మరొకరు ఆ ప్లేస్‌లో ఉంటే సిగ్గుతో సీఎం పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయేవారని…. కానీ చంద్రబాబు ధృడచిత్తం ఉన్న వారు కాబట్టే సీఎం కుర్చీని వదిలిపెట్టకుండా ఉండగలిగారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. టీడీపీ నాయకులు చేస్తున్నా దారుణాలు,రౌడియిజం, హత్యలు నేరాలు ఎన్ని రకాలు ఉంటే అన్ని చేస్తున్నారు. మరి మేమే నిప్పులం అని డబ్బ కొట్టుకుంటారని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.