చంద్రబాబు పానలలో ఏపీలో మహిళలకు రక్షణ లేదని మరోసారి రుజువైయ్యింది. విశాఖపట్టణం జిల్లా పెందుర్తిలో ఓ మహిళా కబ్జాను అడ్డుకుంది. దీంతో కబ్జాదారులు ఆ మహిళను పబ్లిక్‌లో వివస్త్రను చేశారు. కిందపడేసి ఈడ్చారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతోనే కబ్జాకోరులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మహిళను వివస్త్రను చేయడంపై మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు లేదా డాక్యుమెంట్లు లేని భూములు, వివాదంలో ఉన్న భూములు ఉంటే వాటిపై కబ్జాదారులు సొంతం చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తనపై జరిగిన అఘాయిత్యంపై పోలీసులకు బాధిత మహిళ కేసు నమోదు చేసింది.
ఈ ఘటనపై సమాచారం తెలిసినా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు కనీసం ఆ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. అయితే, దళిత మహిళపై టీడీపీ నేతల దాడి రోజు రోజుకు చినికి చినికి గాలివానలా తయారవడంతో టీడీపీ సర్కార్ రాజీకి వచ్చింది. ఆ ఘటనలో బాధిత మహిళలలో ఒకరికి లక్ష రూపాయలు, మరొకరికి రూ.25వేలు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. దీనిపై స్పందించిన దళిత మహిళ అందరూ చూస్తుండగా నాకు జరిగిన అన్యాయానికి డబ్బులిస్తే సరిపోతుందా..? నన్ను వివస్ర్తను చేశారు, నాపై దుర్మార్గపై చర్యలకు పాల్పడ్డారు.. అలా చే సిన వారిని శిక్షించకుండా.. నాకు డబ్బులిస్తారా..? అంటూ చంద్రబాబు సర్కార్‌పై విరచుకుపడింది. దోషులను శిక్షిస్తేనే తనకు న్యాయం జరిగినట్లు భావిస్తానని చెప్పింది బాధిత దళిత మహిళ.