ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తాను చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. సమస్యలకు పరిష్కార మార్గాలను రచిస్తూ.. ప్రజల్లో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ఇటీవలే 700 కిలోమీటర్ల పైచిలుకు మార్క్‌ను దాటింది. అయితే, జగన్ ప్రజల కోసం చేపట్టిన పాదయాత్రలో.. తాము సైతం అంటూ మహిళలు, యువత, వృద్ధులతోపాటు దివ్యాంగులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. తమకు ఎంత కష్ట మైనా సరే.. వైఎస్ జగన్‌ను సీఎంగా చూసేందుకు ఎంత దూరమైనా వస్తామని చెప్తున్నారు దివ్యాంగులు..
అయితే, నిన్న జరిగిన జగన్ పాదయాత్రలో అనంతపురం నుంచి వచ్చిన ఇద్దరు దివ్యాంగులు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ తాను చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఇచ్చాపురంలో ముగుస్తుందని, ఇచ్చాపురం వరకు జగన్ వెంట తాము వస్తామని చెప్పారు. జగన్ సీఎం అయితేనే మాలాంటి వారికి న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లానే జగన్ కూడా తమను ఆదుకుంటాడని తాము నమ్మతున్నట్లు చెప్పారు దివ్యాంగులు. ట్రైసైకిల్‌పై వచ్చిన ఓ మహిళ మాట్లాడుతూ.. నేను జగన్‌ను కలిశాను.. నన్ను చూసిన జగన్.. మీరు లేడీస్ కాబట్టి.. పాదయాత్ర కడ వరకు రాలేరు. ఇబ్బంది పడతారు.
మీరు ఎందుకు జగన్ సీఎం కావాలని అనుకుంటున్నారు అని అడిగిన విలేకరి ప్రశ్నకు ఆమె మాట్లాడుతూ.. కలెక్టర్ ఆఫీసులో వారంలో ఒక రోజు దివ్యాంగుల కోసం ట్రై సైకిళ్లు పంపిణీ చేస్తారని, కానీ చంద్రబాబు సర్కార్ వచ్చాక ఆ పథకాన్ని ఎత్తేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ వచ్చాక తమకు అన్ని కష్టాలు తీరుతాయని వారు పేర్కొన్నారు.