ప్రస్తుతం ఏపీలో టీడీపీని ప్రజలు నమ్మడం లేదని వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పీఏసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ధ్వజమెత్తారు. అంబాజీపేట మండలం వాకలగరువులో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వాసంశెట్టి చినబాబు అధ్యక్షతన నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో పార్టీ సమావేశం బుధవారం జరిగింది. రాజా, చిట్టబ్బాయి మాట్లాడు తూ చంద్రబాబు గత ఎన్నికల్లో 650 హామీలు ప్రకటించి ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారన్నారు. నిరుద్యోగులకు భృతి కల్పిస్తానని మోసం చేశారన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని ఓర్వలేక తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను సీఎం చేసేందుకు ప్రజలే స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారన్నారు. చిట్టిబాబు ఆధ్వర్యంలో టీడీపీ నుంచి సుమారు 200 మంది వైసీపీలో చేరారు. వారికి నేతలు కండువాలు కప్పి ఆహ్వానించారు.
