వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున వైఎస్ జగన్ అడుగులో అడుగులు వేస్తూ నిరంతరం జగన్ వెంటే నడుస్తున్నారు.
ఈ నేపథ్యంలో జగన్ సభలో పాల్గొన్న నెల్లూరు జిల్లా వాసి టీడీపీ కార్యకర్త కృపానిధి (కల్యాణ్) మైక్ అందుకుని మాట్లాడుతూ.. జగన్ అన్నా నేను తెలుగుదేశం పార్టీ. మీ నాన్నగారు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందినప్పుడు నేనూ ఏడ్చా. కానీ, ఎన్నికల సమయంలో మా నాన్న పక్కా టీడీపీ కావడంతో నన్నూ టీడీపీకే ఓటు వేయాలని నాపై ఒత్తిడి తెచ్చాడు. కానీ, నేను టీడీపీకి ఓటు వేయలేదు. నెల్లూరు జిల్లాలో వైసీపీ టిక్కెట్‌పై గెలిచిన కొందరు ఎమ్మెల్యేలను చంద్రబాబు డబ్బు ఆశ చూపి తన పార్టీలో చేర్పించుకున్నారు.
అంతేకాకుండా.., వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేయడం తనను చాలా బాధించిందన్నారు. ఇలా మోసపూరిత హామీలు ఇవ్వడంతోపాటు ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్ర ప్రజలను నిలువెత్తునా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి చంద్రబాబుకు ఇకపై తన ఓటును వేయదలుచుకోలేదని తన అభిప్రాయాన్ని చెప్పాడు కృపానిధి. అంతేకాకుండా చంద్రబాబు మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పిన చంద్రబాబు. . అధికారంలోకి వచ్చాక మద్యం ధరలను వాటర్ ప్యాకెట్‌ల రూపంలో అమ్మేందుకు సిద్ధమయ్యాడని చెప్పారు.