పవన్ కంటే ఆంధ్రా పప్పే బెటర్..! అందరి ముందే పరువు తీసుకున్నాడు..!! ఎందులో తెలుసా..?? అవును, పవన్ కంటే ఆంధ్రా పప్పే బెటర్. అయితే, సోమవారం సాయంత్రం జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ నిర్వహించిన మీడియా సమావేశం వీడియో చూసిన వారంతా అంటున్న మాట ఇది.
పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో భాగంగా మాట్లాడుతూ.. లాస్ట్ బడ్జెట్ సెషన్స్ ఇదే, ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగిందా..? జరిగింది. తరువాత పోయింది. అందరం కలిసి పోరాటం చేద్దాం.. అంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ కంటే ఘోరంగా, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకంటే తగ్గకుండా మాటలను తటపటాయిస్తూ బీజేపీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగింది అన్న వాదనను వినిపించారు.
అంతేకాకుండా.. పలు సందర్భాల్లో పార్లమెంట్‌ను కోర్టు అని సంభోధిస్తూ.. జనసేన పార్టీపెట్టి నాలుగేళ్లు పూర్తి కావస్తున్నా తానింకా రాజకీయాలకు కొత్తేనన్న అర్థాన్ని మళ్లీ ప్రజలముందుంచాడు. మరోవైపు పవన్ కల్యాణ్ ఎప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసినా.. విలేకర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక పారిపోయిన విషయం తెలిసిందే. అయితే, నిన్న జరిగిన మీడియా సమావేశంలోనూ అదే రిపీటైంది. దీంతో మీడియా సమావేశానికి వచ్చిన విలేకర్లంతా.. పవన్ కంటే ఆంధ్రాపప్పే బెటరని, తెలిసినా.. తెలియకపోయినా.. సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాడంటూ… ఉద్దేశించి అన్నారు. మరి మీరేమంటారు..!!
పవన్ కల్యాణ్‌కు నిజంగానే తిక్క ఉందా..? లేదా..? అన్నది మీకే తెలుస్తుంది. మరీ ఆ 33 అంశాలపై మీరు కూడా ఓ లుక్కేయండి మరీ..
1) తెలంగాణ కోసం రక్తమైనా ఇస్తా అంటాడు… తెలంగాణ వస్తే బాధతో పదకొండు రోజులు కూడా అన్నం తినలేదంటాడు.
2) జనసేన పసిగుడ్డు అంటాడు… 12 ఏళ్ల రాజకీయాల గురించి ఆలోచించా అంటాడు.
3) చంద్రబాబు ఓటుకు నోటు కేసు కోర్టులో ఉందంటాడు… జగన్ కేసు కోర్టులో ఉన్నా దోచుకున్నాడు అంటాడు.
4) రిజర్వేషన్ తీసేయాలి అంటాడు… కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటాడు.
5) పార్టీ పెట్టిన తరువాత 44 నెలల కాలంలో 24 రోజుల మాత్రమే ప్రజల ముందుకొచ్చాడు.
6) ప్రజారాజ్యం, చిరంజీవిని చీటింగ్ చేసిన వారిపై పగతోనే జనసేన పెట్టాడు అంటాడు… అదే నోటితో ద్వేషించే వారిని కూడా ప్రేమిస్తుంది జనసేన అంటాడు.
7) ఫాతిమా కాలేజీ సమస్యను చిటికేసినంత ఈజీగా వెంటనే తీర్చేస్తానంటాడు. రెండు నెలలైనా అతీగతీ లేదు.
8) వైఎస్ఆర్సీపీ ఎంపీలు పోరాడుతుంటే కనీసం మద్దతు కూడా ఇవ్వడు.
9) కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ తెచ్చింది బీజేపీ అంటాడు. అదే నోటితో ఆంధ్రా నుంచి తెలంగాణను విడతీయడానికి బీజేపీకి ఎంత ధైర్యం అంటాడు
10) కుల మతాలకు అతీతం జనసేన అంటాడు, కులాల వారీగా సమస్యలు తెలుసుకుంటాను అంటాడు.
11) నా తెలంగాణ ఇది. జై తెలంగాణ అనే మాట వందే మాతరంతో సమానం అంటాడు. మరి తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ రోజు ఒక్క సారికూడా జై తెలంగాణ అనదేదు.
12) చంద్రబాబు, బీజేపీ హామీలకు నాది గ్యారెంటీ అంటాడు… హామీలు నెరవేర్చక పోవడానికి వారికి ఇబ్బందులు ఉన్నాయని అంటాడు.
13) పెరియర్ ఆదర్శమంటాడు. ఆఫీసుల్లో హిందూ దేవుళ్ల ఫోటోలు పెడతాడు.
14) విగ్రహారాధన తప్పు అంటాడు… కొండగట్టు ఆంజనేయ విగ్రహాన్ని ఆరాధించా అంటాడు.
15) జాతీయ సమైక్యత కోసమే జనసేన అంటాడు… ఉత్తర భారత్, దక్షిణ భారత్ అంటాడు.
16) కేసీఆర్ నాలుక కోస్తా అంటాడు… కేసీఆర్ చాలా స్మార్ట్ అంటాడు.
17) ఓటుకు నోటులో తప్పేముంది… అందరూ ఇచ్చేదే కదా అంటాడు.
18) జనసేన జనం కోసం.. నా జీవిత పోరాటం జనం కోసమని 2014 నుంచి అంటూనే ఉన్నాడు. అప్పట్నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల కోసం ప్రశ్నించిందే లేదు.
19) రాజకీయాలను మార్చేస్తా అంటాడు. అధికారంలో ఉన్న చంద్రబాబుకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి విమర్శించలేను అంటాడు. అధికారంలో ఉన్న బీజేపీని మాత్రం విమర్శిస్తాడు.
20) కాంగ్రెస్ దేశాన్ని దోచుకున్నది అంటాడు. దోచుకున్న కాంగ్రెస్‌కు వీహెచ్ సీఎం అభ్యర్థి అయితే మద్దతు ఇస్తానంటాడు.
21) చంద్రబాబు పాలన, కేసీఆర్ పాలన భేష్ అంటాడు… సమస్యలపై పోరాట యాత్ర చేస్తానంటాడు.
22) బలమున్న చోటే.. పోటీ అంటాడు.. అన్ని చోట్లా పోటీ చేస్తానంటాడు.
23) ప్యాకేజీ పాచిన లడ్డు అంటాడు. పాచిన లడ్డూలు తీసుకున్న చంద్రబాబును మాట కూడా అనడు.
24) ఓటుకు నోటు కేసులో ఆధారాలతో పట్టుబడ్డ చంద్రబాబును మాత్రం మంచోడు అంటాడు.
25) ప్రత్యేక హోదా కోసం పోరాడుతా అంటాడు.. ప్రత్యేక హోదా కోసం పోరాడితే కేసులు పెడతా అన్న చంద్రబాబుకు మాత్రం కొమ్ము కాస్తాడు.
26) ఆవేశంతో ఊగిపోతూ.. రెచ్చగొడుతూ మాట్లాడుతాడు. మనకు ఆవేశం కాదు ఆలోచన ముఖ్యం అంటాడు
27) ఏ ఆధారాలు లేకపోయినా జగన్ దోచేశాడు అనేస్తాడు. జగన్‌పై కేసులు ఉన్నాయని అంటాడు.. చంద్రబాబుపై ఉన్న 18 స్టేల గురించి మాట్లాడడు.
28) చంద్రబాబుకు బ్రోకర్‌ను కానూ అంటాడు.. చంద్రబాబును పొగుడుతూ జగన్‌ను విమర్శిస్తాడు.
29) పోలవరం ఆంధ్రాకు వరమంటాడు. పట్టిసీమ పేరుతో దోచుకుని పోలవరం ప్రాజెక్టును నాశనం చేస్తుంటే పల్లెత్తు మాట కూడా అనడు.
30) ప్రత్యేక హోదా కోసం జగన్ పోరాడుతుంటే.. జగన్‌ను విమర్శించి చంద్రబాబును పొగుడుతాడు.
31) అవసరం లేకపోయినా తెలంగాణ కోసం రక్తమిస్తా అంటాడు.. ప్రత్యేక హోదా కోసం రక్తం దారపోసేలా పోరాటం చేస్తా అని మాత్రం అనడు.
32) రాజధాని రైతుకు అండగా ఉంటానంటూ పెరుగన్నం తింటాడు. రాజధాని రైతులను చంద్రబాబు చంపుకు తింటున్నా చంద్రబాబు పల్లెత్తు మాట కూడా అనడు.
33) జగన్ ప్రత్యే కహోదా కోసం బంద్‌కు పిలుపిస్తే.. ఆ రోజే బంద్‌ను విఫలం చేసేందుకు రోడ్డుపైకి మనం రాకూడదు అంటాడు.
ఎంపీలు మాత్రమే పోరాటం చేయాలంటాడు.