ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేబినేట్ మంత్రులు కలిసి రాజధాని అమరావతి నిర్మాణం పేరిట చేసిన భూ కబ్జాల భాగోతం ఒక్కొక్కటిగా బయట పడుతోంది. అయితే, నాడు రాజధాని నిర్మాణానికి స్థలం ఎంపిక విషయంలో సీఎం చంద్రబాబు ఆడిన నాటకాలు అన్నీ ఇన్నీ కావనే విషయం అందరికి తెలిసిందే. అక్కడ కాదు.. ఇక్కడ.. ఇక్కడ కాదు.. అక్కడ అంటూ ప్రజలను తప్పుదారి పట్టించి.. చివరకు ముందుగా అనుకున్న ప్రకారం మంగళగిరి ప్రాంత పరిధిలో ఉన్న ప్రాంతాన్ని చంద్రబాబు రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
అయితే, రాజధాని ఎంపిక విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గానికి, అనుచరులకు లీకులు ఇచ్చారని, ఆ నేపథ్యంలోనే టీడీపీ నేతలంతా అక్కడ భూములను చౌకగా కొన్న తరువాతనే చంద్రబాబు మంగళగిరిలో రాజధానిని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు నుంచి లీకులు అంది భూముల కొనుగోలు చేసిన కంపెనీల్లో హెరిటేజ్ ఒకటి. ఇంతకీ హెరిటేజ్ అమరావతి భూముల్లో ఎలా కుంభకోణానికి పాల్పడిందంటే..!!
సీఎం చంద్రబాబు మంగళగిరి ప్రాంతాన్ని అధికారికంగా రాజధానిగా ప్రకటించక ముందే హెరిటేజ్‌కు లీకులు ఇవ్వడంతో…. రాజధాని ప్రాంతంలో హెరిటేజ్ కంపెనీ 14 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అయితే, చంద్రబాబు ముందుగా చెప్పిన ల్యాండ్ పూలింగ్ విధానాన్ని హెరిటేజ్ కంపెనీ కొనుగోలు చేసిన భూమికి వర్తించకుండా.. సీఎం చంద్రబాబు జాగ్రత్త పడ్డారు.
అంతేకాకుండా, చంద్రబాబు తనకు చెందిన హెరిటేజ్ కంపెనీ భూముల ధరను పెంచే క్రమంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెరిటేజ్ కంపెనీ రాజధాని ప్రాంతంలో ఎక్కడైతే భూములు కొనుగోలు చేసిందో.. ఆ ప్రాంతం నుంచే రోడ్ వేసేందుకు చంద్రబాబు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో.. హెరిటేజ్ భూముల విలువ మరింత పెరగనుంది.