ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇడుపులపాయ నుంచి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజాదారణతో విజయవంతంగా నిరంతరాయంగా కొనసాగుతోంది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటూ.. సమస్యల పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ తన ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. వృద్ధులు అయితే, తమకు పింఛన్ అందక రోజుకు కనీసం ఒక్క పూటైనా తినేందుకు తిండి లేకుందని, నిరుద్యోగులైతే.. చంద్రబాబు సర్కార్ ఇంకా ఒక్క నోటిఫికేషన్ కూడా వదల్లేదని, డ్వాక్రా సంఘాలు, రైతులు అయితే, చంద్రబాబు అధికారంలోకి బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను మాఫీ చేస్తానని చెప్పి.. చివరకు మాకందరికీ కుచ్చుటోపీ పెట్టాడని జగన్ ముందు వారి వారి సమస్యలను ఏకరువు పెడుతున్నారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇడుపులపాయ నుంచి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజాదారణతో విజయవంతంగా నిరంతరాయంగా కొనసాగుతోంది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటూ.. సమస్యల పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ తన ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. వృద్ధులు అయితే, తమకు పింఛన్ అందక రోజుకు కనీసం ఒక్క పూటైనా తినేందుకు తిండి లేకుందని, నిరుద్యోగులైతే.. చంద్రబాబు సర్కార్ ఇంకా ఒక్క నోటిఫికేషన్ కూడా వదల్లేదని, డ్వాక్రా సంఘాలు, రైతులు అయితే, చంద్రబాబు అధికారంలోకి బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను మాఫీ చేస్తానని చెప్పి.. చివరకు మాకందరికీ కుచ్చుటోపీ పెట్టాడని జగన్ ముందు వారి వారి సమస్యలను ఏకరువు పెడుతున్నారు.
అయితే, మంగళవారం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 144వ రోజు గన్నవరం నియోజకవర్గం గోపవరపు గూడెంలో విజయవంతంగా కొనసాగింది. అందులో భాగంగా ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన ఓ బాలుడు తన స్కూలు బ్యాగులోని పలకను తీసుకుని, తన తండ్రితో కలిసి వైఎస్ జగన్‌ను కలిశాడు. బాలుడి చేతిలోని పలకను చూసిన జగన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇంతకీ ఆ పలకమీద ఏమి ఉందంటే..!! వైఎస్ఆర్.. అవును ఆ బాలుడి చేతిలోని పలకమీద వైఎస్ఆర్ అని ఉంది. దీంతో ఆ పలక గురించి ఆ బాలుడి తండ్రిని ఆరా తీశారు వైఎస్ జగన్. ఆ బాలుడి తండ్రి జగన్‌తో ఇలా చెప్పాడు. ఐదేళ్ల క్రితం నేను మా పిల్లాడితో అక్షరాభ్యాసం చేయిస్తూ వైఎస్ఆర్ అని దిద్దించాను. ఆ రోజున నేను అ ఆ ఆ అని పలకమీద రాయబోతుంటే.. మా పిల్లాడు అ ఆ కాదు.. వైఎస్ఆర్ అని రాయాలంటూ మారాం చేశాడని, అలా ఆ పలకపై వైఎస్ఆర్ అని రాయించానంటూ జగన్‌తో చెప్పుకొచ్చాడు ఆ బాలుడి తండ్రి. దీంతో ఐదేళ్ల క్రితం అక్షరాభ్యాసం చేస్తూ వైఎస్ఆర్ అని రాసిన ఆ పలకను.. జగన్‌ను చూపించడం కోసం తీసుకు రావడంతో.. ఒక్కసారిగా ఆశ్చర్య పోయాడు.