ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అలాగే, టీడీపీ కార్యకర్తల నుంచి నేతల వరకు ఓ సాధారణ మహిళ తన ప్రసంగంతో ముచ్చెమటలు పట్టించింది. కాగా, విజయవాడ కేంద్రంగా టీడీపీ మహానాడు జరిగిన విషయం తెలిసిందే. మహానాడు సభల్లో భాగంగా సీఎం చంద్రబాబు నుంచి, నేతలు, నాయకులు, కార్యకర్తల వరకు వైఎస్ జగన్ ఫ్యామిలీనే టార్గెట్ చేస్తూ ప్రసంగాలు కొనసాగించారు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, ఆ వీడియోలు చూసిన ఓ సాధారణ మహిళ తన అభిప్రాయాన్ని సోషల్ మాధ్యమాల్లో పోస్టు చేసింది.
ఆ సాధారణ మహిళ పోస్టు చేసిన వీడియోలో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన మహానాడు కార్యక్రమం ఆధ్యాంతం అత్యంత చెత్తగా కొనసాగిందన్నారు. నాలుగేళ్ల నుంచి ఏపీలో అధికారంలో ఉన్న మీరు ప్రజలకు ఏం చేశారో చెప్పాల్సింది పోయి.. జగన్‌ను తిట్టడానికే సభలు నిర్వహిస్తారా..? అంటూ ప్రశ్నించింది. అయితే, టీడీపీపై ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉందో ఆ మహిళ చెప్పుకొచ్చింది. ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు ఆ మహిళ మాటల్లో ఇలా.. మేం జగన్ పాదయాత్ర చూసేందుకు భీమవరం వెళ్లాం. టీ తాగుదామని ఒక చిన్న టీ దుకాణం వద్ద ఆగాం. మాటల్లో మాటగా చంద్రబాబు పాలన ఎలా ఉంది అని ఆ టీ దుకాణం యజమానిని అడిగాం. నేను అలా అడిగానో.. లేదో.. ఒక్కసారిగా ఆ దుకాణం యజమాని నోటి నుంచి బూతులు రావడం ప్రారంభమయ్యాయి. ఎవడండి చంద్రబాబు నాయుడు అని ప్రారంభించి లం… కు అనే దాక పోయిందన్నారు.
అలాగే, తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి జగన్ గురించి మాట్లాడిన మాటలు తనను ఎంతో బాధించాయన్నారు. నర్సిరెడ్డి వైఎస్ విజయమ్మ, షర్మల, భారతిల గురించి మాట్లాడం దారుణమన్నారు. నర్సిరెడ్డి నీవు మాట్లాడిన వీడియోను మీ ఇంట్లోని మహిళలకు చూపించగలవా..? అంటూ ప్రశ్నించారు. ఏదేమైనా మహానాడు వేదికగా జగన్ ఫ్యామిలీని ఉద్దేశించి టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి.