ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు, కాంగ్రెస్ నేతలు ఇలా ఎంతోమంది పర్యటిస్తున్నా.. ఉత్తరాంధ్రను మాత్రం ఆ ఒక్క పార్టీనే క్లీన్ స్వీప్ చేయబోతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 24, వైసీపీ 9, బీజేపీ ఒక అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సీన్ రివర్స్ కాబోతోంది. దీనికంతటికి కారణం వైఎస్ జగన్. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను చైతన్య పరుస్తూ అటు కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీని, ఇటు రాష్ట్రంలోని టీడీపీని జగన్ తన రాజకీయ చతురతతో ఎదురొడ్డి నిలబడటమే. ఈ విషయాన్నే ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన నివేదికలో పేర్కొన్నాడు.
SEE ALSO:
ఇంతకీ లగడపాటి రాజగోపాల్ నివేదిక ఏమిటి..? ఎక్కడ బయటపెట్టాడు..? ఎలా లీక్ అయింది..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.
SEE ALSO:
అయితే, ఇటీవల లగడపాటి రాజగోపాల్ టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన విషయం తెలిసిందే. లాగాకో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కోసం బ ఎయిల్ అవుట్ ప్యాకేజీని కోరుతూ లగడపాటి రాజగోపాల్ చంద్రబాబును కలిసినట్టు సమాచారం. అయితే, వీరిద్దరి భేటీలో 60 పేజీలతో కూడిన ఓ నివేదిక చర్చకు వచ్చింది. అదే లడగపాటి చంద్రబాబుకు ఇచ్చిన నివేదిక. ఆ నివేదిక ద్వారా లడగపాటి రాజగోపాల్ కొన్ని ఆసక్తికర విషయాలను చంద్రబాబుకు వెల్లడించారు.
SEE ALSO:
అయితే, ఆ నివేదికను క్షుణ్ణంగా చదివిన టీడీపీ సీనియర్ నేతల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 24, వైసీపీ 9, బీజేపీ ఒక అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సీన్ రివర్స్ కాబోతోంది అంటూ ఆ నివేదిక స్పష్టం చేసింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే కేవలం ఒక్క ఉత్తరాంధ్రలోనే కొత్తగా మరో పది శాతం ఓట్లు వైసీపీ కైవసం చేసుకోనుంది.
SEE ALSO:
కాగా, ఉత్తరాంధ్రలోని ఉన్న మూడు జిల్లాలు శ్రీకాకుళం, వియనగరం, విశాఖపట్నం కాగా,..
శ్రీకాకుళం జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య మొత్తం 10 కాగా అందులో వైసీపీ 7, టీడీపీ 3 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోనుంది.
విజయనగరం జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య మొత్తం 9 కాగా అందులో వైసీపీ 7, టీడీపీ 2 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోనుంది.
విశాఖపట్నం జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య మొత్తం 14 కాగా అందులో వైసీపీ 10, టీడీపీ 3, జనేన 1 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోనుందని లగడపాటి నివేదిక వెల్లడించింది.
SEE ALSO:
ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికలతోపాటు, గతంలో లగడపాటి చేసిన సర్వేలన్నీ ఖచ్చితత్వాన్ని ప్రదర్శించాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో భేటీలో భాగంగా సమర్పించిన లగడపాటి రాజగోపాల్ సర్వేకూడా ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా లగడపాటి రాజగోపాల్ సర్వే టీడీపీ శ్రేణుల్లో కాస్త ఆందోళన పెంచే విషయమే.
SEE ALSO: