ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. గతంలో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ బాటలోనే నడుస్తూ..ప్రజలకు మరింత చేరువ కావాలని పాదయాత్ర మొదలు పెట్టారు వైఎస్ జగన్. ఇక జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.. ఇప్పటికే రెండు వేల కిలోమీటర్ల పూర్తి చేసుకోని జగన్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. పాదయత్రలో ప్రజలు తండోపతండాలుగా వచ్చి జగన్ తో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు.
అయితే 184 రోజులుగా చేస్తున్న వైఎస్ జగన్ పాదయాత్రకు ఎక్కడా లేని ఆటంకం తూర్పు గోదావరి జిల్లాలో వచ్చింది. జగన్ పాదయాత్ర మరో రెండు, మూడు రోజుల్లో తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కొవ్వూరు నియోజకవర్గం నుంచి తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశించాలంటే గోదావరి వంతెనను దాటాలి. కానీ వంతెన చాలా బలహీనంగా ఉండటం..ఎక్కువ మంది జనాలు ఆ వంతెనపై పయనిస్తే..కూలిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం పాదయాత్రకు అనుమతిని నిరాకరించిన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు రాజమండ్రి డీఎస్పీ జగన్ కు లేఖ రాశారని సమచారం. జగన్ పాదయాత్ర గోదావరి వంతెనపై నుంచి కాకుండా వేరే మార్గం ద్వారా రావాలని ఆయన కోరారంట. బ్రిడ్జి కండిషన్ సరిగా లేనందునే అనుమతిని ఇవ్వడ లేదని పోలీసులు చెప్పారంట. శాంతి భద్రతల దృష్ట్యా రాజమండ్రిలో కూడా జగన్ బహిరంగ సభకు అనుమతించబోమని పోలీసులు చెబుతున్నారు. అయితే తమ పాద యాత్రల వల్ల ప్రభుత్వానికి భయం వేస్తుందని..అందుకే ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తే ఊరుకోబోమని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.