వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం జగన్ చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కొనసాగుతుంది.ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం జగన్ ముమ్మిడివరం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్బంగా జగన్ మోహన్ రెడ్డి కి ప్రజల ఘన స్వాగతం పలికారు.బంతిపూలతో రహదారి వేసారు.కొంతమంది యువతులు అక్కడ కూర్చొని జగన్ గురించి పాట పాడుతూ..స్వాగతం పలికారు.పూల వర్షం కురిపించారు. డప్పులు, మంగళవాయిద్యాలతో అపూర్వ స్వాగతం పలికారు.
జగన్ కోసం పాట పాడిన చెల్లెమ్మలు
రావయ్యా.. రావయ్యా.. రారా మా జగనయ్యా అంటూ అన్నకి స్వాగతం పలుకుతున్న చెల్లెళ్ళు #PrajaSankalpaYatra
Publiée par Oke Okkadu JMR sur Samedi 30 juin 2018
అనంతరం జగన్ అక్కడి నుంచి రాజుపాలెం, నడిమిలంక క్రాస్, అన్నంపల్లి క్రాస్ చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర తిరిగి 2.45కు ప్రారంభమౌతుంది. అనంతరం మురమళ్ల మీదుగా కొమరగిరి వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది.