నిన్న విశాఖ జిల్లా పెందుర్తి పర్యటనలో ఉన్న జనసేన అదినేత టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, అతని కుమారుడుకు ఘాటుగా హెచ్చరించారు. భూకబ్జాలు విపరీతంగా పెరిగాయని, జనసేన కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే గారు మీ కుమారుడిని అదుపులో పెట్టుకోపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని, కేసులు ఉపసంహరించుకోకపోతే అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. జనసేన ఫ్లెక్సీలను సైతం ఎమ్మెల్యే కుమారుడి ప్రోద్బలంతో తొలగిస్తున్నారని పవన్ ఆరోపించారు.
