దేశ రాజధాని న్యూఢిల్లీ పరిధిలోగల పార్లమెంట్ వేదికగా వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. అయితే, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్‌లో ప్రస్తుతం చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చర్చలో భగంగా ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనను చూసిన వారంతా బహుశా.. చట్ట సభల్లో ఇది ఒక అరుదైన సంఘటనగా చెప్పుకుంటున్నారు.
ఇక అసలు విషయానికొస్తే.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఇవాళ పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. మోడీ సర్కార్‌పై విమర్శల వర్షం కురిపించారు. మోడీపై తనకు ద్వేషం, కోపం ఉన్నాయని. వాటిని తొలగిస్తాను అంటూ.. ఎవ్వరూ ఊహించని విధంగా రాహుల్ గాంధీ మోడీ వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వడమే కాకుండా.. ఆలింగనం చేసుకున్నారు. ఈ ఘటనతో మోడీ కూడా అవాక్కయ్యారు. బీజేపీపై అవిశ్వాసం చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో చర్చకు దారి తీసింది. బీజేపీపై అవిశ్వాసం చర్చకన్నా.. ప్రధాని మోడీని రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకోవడమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.