ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం అయ్యే వ్యక్తి ఎవ్వరైనా అన్ని జిల్లాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమవ్వాలి.. ముందుగా ఆయా జిల్లాల్లో పర్యటించాలి. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు వేరేలా ఉంది. ఆయన కనీసం ఎన్నికల నోటిఫికేషన్ మరో నెలలో రానుండగా ఇప్పటివరకూ 8జిల్లాల్లో ఆయన అసలు పర్యటించలేదు. తాజాగా జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో తమతో పొత్తు కోసం టీడీపీ ప్రయత్నిస్తున్నాయని పార్టీ శ్రేణులతో వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ తమకు బలం లేదంటూనే కొన్ని పార్టీలు తమతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఈ తమకు ఎన్నికల్లో బలం లేకుంటే ఈ రకమైన ప్రతిపాదనలు, ప్రయత్నాలు ఎందుకు చేస్తారంటూ పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో అన్నారట.. అలాగే నన్నేమైనా అనండిం నా చంద్రబాబును మాత్రం ఏమీ అనొద్దు అంటే నేనే అంటాను. ఎందుకంటే నేను ఏమనాలో, ఎంత వరకు అనాలో నాకే తెలుసు అంటున్నారట. దీంతో టీడీపీ జనసేనల పొత్తు దాదాపుగా ఖరారైనట్టుగా కనిపిస్తోంది.నాలుగేళ్ల సంసారం కదా బాబుకు వ్యతిరేకంగా మారలేడు నటుడు కాబట్టి ఆ మాత్రమైనా నెట్టుకొస్తున్నాడు అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. చంద్రబాబు గారూ అంటూ మీటింగుల్లో మర్యాద పూర్వకమైన పూనకం చూపించే పవన్, ఎప్పటికైనా ఆగూటి పక్షేనని మరోసారి రుజువవుతోంది. తాజాగా తెనాలి సభలో మాట్లాడుతూ చంద్రబాబుపై విపరీతమైన ప్రేమ కురిపించాడు కల్యాణ్. కెసిఆర్, చంద్రబాబుపై కక్షసాధిస్తున్నారట. అందుకోసమే జగన్తో కలిశాడంటూ నవ్వుతారనే కనీస స్పృహ కూడా లేకుండా మాట్లాడారు. ఏ కక్షసాధింపుకోసం చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో కూటమి కట్టాడు? ఏ కక్ష సాధింపుకోసం కాంగ్రెస్పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఏ కక్షసాధింపు కోసం హరికృష్ణ కూతుర్ని ఓడిపోయే చోట నిలబెట్టి అవమానం ఇవి మాత్రం పవన్ మాట్లాడరు. అలాగే చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నన్నుకాపాడాల్సిన బాధ్యత మీదే అంటూ ప్రజల్ని కోరుతున్నాడు. మధ్యమధ్యలో బాబును ఇబ్బంది పెట్టొద్దని కూడా అభిమానుల్ని పవన్ ఆదేశించాడు.. పదవికోసం మాత్రమే రాజకీయాలు చేసే చంద్రబాబుకి సాయం చేయకుండా ఉండలేనంటాడు పవన్. ప్రజల కోసం పదేళ్లుగా నిత్యం శ్రమిస్తూం ఆ ప్రజల బాగుకోసం ప్రభుత్వంలోకి రావాలనుకునే వైయస్ జగన్‌ది అధికార వాంఛ అంటూ తన మానసిక స్థితిని తెలుపుతున్నాడు.. మళ్లీ అంతలోనే చంద్రబాబుపై అందరూ కక్షసాధిస్తున్నారు ఇది అన్యాయం అంటాడు. అసలు ఈ మనిషి ఎప్పుడు ఏంమాట్లాడుతున్నాడో అర్థంచేసుకోవడం జనసేనులకు మాత్రం అర్ధం కావట్లేదు. కానీ వీరిద్దరి స్నేహం ఎంత బలమైనదో మాత్రం అర్ధమవుతోంది.
