ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్రమంతా ఒక్కటై రోడ్డెక్కి హోదా కోసం పోరాడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ ఎక్కడున్నారని నారా లోకేశ్ ట్విటర్‌లో ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. 26 కేసులుకు బయపడి జగన్ దాక్కున్నారా? అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసి జైలుకి పంపుతారనే భయం జగన్‌కు పట్టుకుందని, అందుకే లోటస్‌పాండ్‌లో పడుకున్నారని విమర్శించారు.
మోడీ గారు పర్యటన సందర్భంగా రాష్ట్రమంతా ఒక్కటై రోడ్డెక్కి హోదా కోసం పోరాడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ ఎక్కడా? వైకాపా నాయకులు ఎక్కడ?
26 కేసులుకు బయపడి జగన్ దాక్కున్నారా?అరెస్ట్ చేసి జైలు కి పంపుతారు అని భయం పట్టుకుందా?లేక లోటస్ పాండ్ లో పడుకున్నారా? #GoBackModi #ModiIsaMistake
— Lokesh Nara (@naralokesh) February 10, 2019