తండ్రికి తగ్గ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈనెల 17న నిర్వహించనున్న వైసీపీ బీసీ గర్జనకు హాజరు కావాల్సిందిగా ఆ పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి కృష్ణయ్యను ఆహ్వానించారు.ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా బీసీల అభ్యున్నతికి ఉద్యమిస్తున్న ఆర్ కృష్ణయ్యని సాదరంగా ఆంధ్రప్రదేశ్ కి ఆహ్వానిస్తున్నాం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన 17న ఏలూరులో జరిగే బీసీ గర్జనకు ఆహ్వానించాం అని తెలిపారు అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. వైఎస్సార్ బీసీలు ఏం కోరితే అది కాదనకుండా ఇచ్చారు. ఎంత ఫీజు ఉంటే అంత రీయింబర్స్మెంట్ ఇచ్చిన మంచి మనిషి.ఆయనలానే బీసీలంటే వైఎస్ జగన్‌కి ప్రేమ. దేశవ్యాప్తంగా 36 పార్టీలను బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరితే, స్పందించింది కేవలం వైఎస్సార్సీపీ ఒక్కటే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. అని కృష్ణయ్య అన్నారు.
