గుంటూరుజిల్లా కొండవీడు వద్ద రైతు మరణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాద్యత వహించాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి అన్నారు.ఆయన ట్విటర్ లో తీవ్రంగా స్పందించారు.. ‘కొండవీడు గ్రామానికి చంద్రబాబు హెలికాప్టర్లో వెళ్లాలా?. హెలిప్యాడ్ కోసం రైతు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. మేం శవాల మీద పేలాలు ఏరుకుంటున్నామని లోకేష్ విమర్శిస్తున్నారు. ఇంతకీ శవం ఎవరు? నువ్వా? మీ నాన్నా?’ అని అన్నారు. చంద్రబాబు హెలిపాడ్ కోసం కోటయ్య అనే రైతును దారుణంగా కొట్టి చంపిన ఘటనపై పోలీసు అధికారులపై హత్య కేసు నమోదు చేయాలి. ఇది ప్రభుత్వం చేసిన క్రూర హత్య. చంద్రబాబు దీనికి బాధ్యత వహించాలి. మృతుడు పిట్టల కోటయ్య కుటుంబానికి రూ.50 లక్షల నష్ట పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సంఘటనపై కేంద్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలి. సిఎం, డిజిపిలను బాధ్యులుగా చేసి దర్యాప్తుకు ఆదేశించాలి. రాజకీయ అవసరాల కోసం రోజుకో రాష్ట్రం తిరిగే బాబు గంట సేపు రోడ్డుపై ప్రయాణించలేరా?. కొండవీడు రోడ్డు ప్రారంభానికి ఇంత హంగామా ఎందుకు చంద్రబాబు? అమరావతికి 50 కిమీ దూరంలో ఉన్న గ్రామానికి హెలికాప్టర్లో వెళ్లాలా? హెలిపాడ్ కోసం చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. హాస్పిటల్కు తీసుకెళ్లకుండా అడ్డుకుంటారా? చంద్రబాబు పాలనలో పేదల ప్రాణాలకు కనీస విలువ లేకుండా పోయింది అని విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నటది ఉన్నట్లు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటే ఆయన ట్విటర్ కు టీడీపీ నేతలు బయపడుతున్నట్లు తెలుస్తుంది. ఎప్పుడు ఎవరి మీద ట్వీట్ చేస్తాడని…!
