నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముగ్గురు వైసీపి కార్యకర్తలపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేసారు. నెల్లూరులోని వేదాయపాళెం పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీనగర్ లో ఇతర ప్రాంతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు గురువారం నాడు ల్యాప్ టాప్ లతో ఇంటింటికి తిరుగుతూ సర్వేలు నిర్వహిస్తూ కనిపించారు. సర్వేలపేరుతో కొందరు ఓట్లు తొలగిస్తున్నారని ఇటీవల వస్తున్న వార్తల నేపద్యంలో స్థానిక వైసీపి కార్యకర్తలు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రాత్రికల్లా ఫిర్యాదు ఇవ్వాలని వేదాయపాళెం పోలీసులు వైసీపి కార్యకర్తలకు కబురు పంపారు. ఫిర్యాదు ఇస్తామని అక్కడికి వెళ్లగా వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సర్వే చేస్తున్న ముగ్గురు వ్యక్తులు వైసీపి కార్యకర్తలపై ఫిర్యాదు చేసినట్లు వివరించారు. తమపై దాడి చేసి ల్యాప్ టాప్ లు పగులగొట్టినట్లు ఫిర్యాదు చేశారని తెలియజేశారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. సర్వే చేస్తున్న వ్యక్తులను పట్టించిన తమ కార్యకర్తలపై కేసులు ఎలానమోదు చేస్తారని నిలదీసారు. పోలీసులు దారునంగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అయితే తప్పు తమవద్ద పెట్టుకున్న పోలీసులు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కొందరు దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు. టీడీపీ అనుకుల ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా , వెబుసైట్లో వైసీపీ ఎమ్మెల్యేకు వ్యతీరేకంగా ప్రచారం చేస్తున్నారు. మరికోన్ని టీటీపీ చానెళ్లు మద్యం తాగి పోలీస్ స్టేషన్ కు వచ్చి రభస చేసినట్లు ప్రచారం చేశారు. అసలు మద్యంతాగే అలవాటే లేని కోటంరెడ్డి మద్యం తాగడమేంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కావాలనే ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కోటంరెడ్డి ని అరెస్ట్ చేయటంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలను విడుదల చేయాలని పోలీసులను కోరడంతో పోలీసులను దూషించారంటూ కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేయడం, అనంతరం ఆయనను ఐదోనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించడం పట్ల జిల్లా వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.